Most Visited Websites: స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. ఇంటర్నెట్ చౌకగా మారాక సోషల్ మీడియాతోపాటు వివిధ వెబ్‌సైట్ల వినియోగం పెరిగింది. అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. కావాల్సి సమాచారం కోసం కొందరు. వినోదం కోసం కొందరు. వృత్తిపరంగా మరికొందరు, వివిధ వ్యాపకాలకోసం అనేక మంది వివిధ సైట్లను చూస్తున్నారు. కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ చేస్తున్నారు. తాజాగా గత జూన్‌లో ప్రపంచ వ్యాప్తం పది సైట్లను ఎక్కువ మంది వీక్షించారని ఇటీవల గుర్తించారు. వాటిలో గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, బైడు.కాం, వికీపీడియా, యాహూ, యెండెక్స్.కాం, వాట్సాప్‌ను అత్యధికంగా చూసినట్లు నిర్ధారణ అయింది.
మొదటి స్థానంలో గూగుల్..
ఎక్కువ మంది చూసిన టాప్‌టెన్ వెబ్‌సైట్లలో గూగుల్ మొదటి స్థానంలో ఉంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో దొరుకుతుండడంతో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, క్రీడాకారులు, రైతులు, వ్యాపారులు ఇలా అనేకరంగాల వారు వారికి సంబంధించిన సమాచారం కోసం గూగుల్ సెర్చ్ చేశారు.
యూట్యూబ్..
ఎక్కువ వ్యూవర్‌షిప్ ఉన్న మీడియాగా యూట్యూబ్ నిలిచింది. ప్రస్తుతం యూట్యూబ్ న్యూస్ చానెళ్లు, విద్యార్థులు, యువకులు, యాక్టర్లు, డాక్టర్లు, విద్యాసంస్థలు, ఇలా అనేక రంగాలవారు సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టుకున్నారు. దీంతో ఎవరికి కావాల్సిన సమాచారం కోసం వారు యూట్యూబ్‌లో వీడియోలు సెర్చ్‌చేసి చూశారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్..
ఈ మూడు సోషల్‌మీడియా యాప్‌లు. నిత్యం వీటిని చూడకుండా ఉడని పరిస్థితి నెలకొంది. రీల్స్ చేసినవారు, రీల్స్ చూసేవారు, విలువైన సమాచారం చూసేవారు, హీరో హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు చూసేవారు, కొత్తగా వచ్చే అప్‌డేట్ తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు వీటనిని ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు. ట్విట్టర్‌ను ఎక్కువగా రాజకీయ నాయకులు, సినిమాస్టారుల, వ్యాపార దిగ్గజాలు ఉపయోగిస్తున్నారు. వీరు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. ప్రతిపక్షాలకు, అధికార పక్షాలకు చేరవేస్తున్నారు.
వికీపీడియా..
ఏదైనా అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాల్సి వచ్చినప్పుడు అందరూ వికీపీడియానే అశ్రయిస్తారు. ముఖ్యమంగా విద్యార్థులు విద్యాసంబంధ విషయాలు, పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాల కోసం వికీపీడియాను ఆశ్రయిస్తున్నారు. వివిధ ఉద్యోగాలకు పోటీ పడే వారు కూడా ముఖ్యమైన సమాచారం కోసం వికీపీడియానే ఆశ్రయిస్తున్నారు.
ఇక వాట్సాప్..
సమాచార బదలీ సాధనంగా వాట్సాప్ మారింది. నిత్యం కోట్ల మెస్సేజ్‌లు పర్సనల్‌గా, గ్రూపుగా షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా యాప్‌ల తరహాలోనే విలువైనసమాచారం, ఉపయోగకరమైన సమాచారం డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు.
యాహూ, బైడు.కాం, యెండెక్స్.కాం..
ఇవి పూర్తిగా పర్సనల్ వెబ్‌పైట్లు. వ్యక్తిగత సమాచారం షేర్, సేవ్, బదిలీకి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. బిజినెస్, వృత్తి, ఉద్యోగాల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కంపెనీలు పెరుగుతుండడంతో వీటి వినియోగం కూడా పెరుగుతోంది. జీమెయిల్ పరిమితులు కూడా కస్టమర్లను ఇతర సైట్ల వైపు మళ్లిస్తున్నాయి.