New Year 2025: మరో ఐదు రోజుల్లో 2024 కాలగర్భంలో కలవబోతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టార్ హోటళ్ల నుంచి గల్లీ బాయస్ వరకు అందరూ ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఇక టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. ఇలా అందరిలో వేడుకల జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. చాలా మంది డిసెంబర్ 31 రాగానే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బ్యాట్ హ్యాబిట్స్‌ను వదిలేస్తామని ప్రమాణాలు చేస్తారు. గోల్స్ నిర్ణయించుకుంటారు. కానీ, ఈ హామీలు ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఎన్నికల హామీలను మించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సాధారణంగా తీసుకునే హామీలు..
మత్తు వదిలేయడం..
చాలా మంది మద్యం తాగడం, సిగరెట్ తాగడం, నిషేధిత మత్తు పదార్థాలు సేవించడం కొత్త సవవత్సరంలో మానేస్తామని ప్రమాణం చేస్తారు. ఈ పేరు చెప్పుకుని డిసెంబర్ 31న ఫుల్లుగా తాగుతారు. సిగరెట్టు పీలుస్తారు. ఇతర మత్తుపదార్థాలతోనే పార్టీలు ఏర్పాటు చేస్తారు. తెల్లవారు జాము వరకు ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు తలకు పట్టిందని, ఈ ఒక్కరోజు ఉతార్ అని తాగుతారు. తర్వాత ఫ్రెండ్ దావత్, ఫ్యామిలీ ఫంక్షన్ అంటూ ప్రమాణం మచ్చిపోతున్నారు.
ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియాలో సమయాన్ని తగ్గించడం..
ఎక్కువ సమయం సెల్‌ఫోన్ లేదా సోషల్ మీడియాతో గడపడం, దీని వల్ల కలిగే ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నించడం. కానీ చాలా మంది ఈ అలవాటుకు దూరం కావడం లేదు. చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇంకా చూసే సమయం పెంచుకుంటున్నారు.
ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం
ఎక్కువ మంది డిసెంబర్ 31న తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని నిర్ణయిస్తారు. వారు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని నిర్దేశిస్తారు. పండుగల తర్వాత అదనపు బరువు తగ్గించుకోవడానికి, పుష్కలంగా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఆధారిత ఆహారం తీసుకోవాలని ప్రయత్నిస్తారు.
ఆర్థిక లక్ష్యాలను సాధించడం
ఖర్చులు తగ్గించి, ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని సేవ్ చేయాలని సంకల్పం. కొంత మంది పెట్టుబడులు చేసే ప్రణాళికను రూపొందిస్తారు, జీఎస్‌టి, స్టాక్స్, రియల్ ఎస్టేట్ మొదలైన వాటిలో. ఉదయాన్ని ప్రారంభించడంలో మరింత శ్రద్ధ వహించడం.
వ్యక్తిగత అభివృద్ధి
కొత్త భాషలు, కోర్సులు, హాబీలు మొదలుపెట్టి వ్యక్తిగత అభివద్ధి కోసం సమయం కేటాయించటం. కొన్ని సంవత్సరాల్లో చదవలేని పుస్తకాలు పూర్తిచేసే లక్ష్యం తీసుకుంటారు. ప్రతీøజు, ప్రతీ వారం, నెల ప్రారంభంలో సమయం కేటాయించి, మరింత ప్రయోజనకరమైన పనులు చేయడం. సమయాన్ని ఎక్కువగా కుటుంబం మరియు స్నేహితులతో గడపడం: ఈ సంవత్సరంలో ఎక్కువగా వారి కోసం సమయం కేటాయించాలని అనుకుంటారు.
మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం
మానసిక శాంతి కోసం మెడిటేషన్ లేదా యోగా చేయడం: మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి సమయం కేటాయించడం.
సాయపడడం
వలంటీర్‌గా సేవలు అందించడం లేదా ఆర్థికంగా దాతత్వం చేయడం, ఇతరుల సహాయానికి ముందుకు రావడం. సమాజంలో నెమ్మదిగా మంచి సంబంధాలు పెంచుకోవడం: స్నేహితులు, కుటుంబ సభ్యులతో బలమైన సంబంధాలను కొనసాగించుకోవడం.