Vastu: వాస్తు శాస్త్రం పై నమ్మకం ఉండడం చాలా సాధారణం. ఇది ఇంటి నిర్మాణం, కట్టడాల కొరకు ప్రాచీన శాస్త్రం, రేఖాచిత్రం మరియు ప్రకృతితో అనుసంధానంగా ఉన్నది. వాస్తు శాస్త్రం అనేక సంస్కృతుల్లో గణనీయమైన ప్రాముఖ్యతను పొందింది, మరియు ఇది మన జీవితం, శాంతి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చని చాలా మంది నమ్ముతారు. ఇంట్లో బాగా అనిపించకపోయినా, ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఏదైనా కారణంతో మరణాలు జరిగినా, ఆర్థికంగా నష్టాలు వస్తున్నా.. చాలా మంది పండితులను ఆశ్రయిస్తున్నారు. అయితే వాస్తు ఉండొచ్చు. కానీ అదే పిచ్చిగా మారకూడదు. కొందరు పండితులు వాస్తు మాటున బాగా సంపాదించుకుంటున్నారు. కానీ, తన దగ్గరకు వచ్చిన వారి సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. తాజాగా ఓ ఇంటి యజమాని వాస్తు పండితుడి సూచనలను పాటించి తన ఇంటినే కూల్చుకున్నాడు. ఈఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..
ఇంటి నిర్మాణ సమయంలోనే చాలా మంది వాస్తు చూసుకుంటున్నారు. కానీ ఓ వ్యక్తి నిర్మాణ అయిన తర్వాత వాస్తు పండితుడిని కలిశాడు. ఆ పండితుడు ఇంటికి వాస్తుదోషం ఉందని చెప్పాడు. ముందు పిల్లర్ ఎక్కువగా వచ్చిందని, దానిని తొలగించాలని సూచించారు. అలా చేస్తే కనకవరషం కుస్తుందని చెప్పాడట. దీంతో పండితుని మాట విన్న ఇంటి యజమాని.. పిల్లర్ కూల్చివేత పనులు చేపట్టాడు. ఈ క్రమంలో మిగతా పిల్లర్లు కూడా కదలడగంతో భవనం మొత్తం ఒకవైపు వంగిపోయింది. ఈ వీడియోను దిలీప్ అనే వ్యక్తి.. ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఇది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
కామెంట్స్…
వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఇంత పిచ్చి ఏంటిరా బాబు అని కామెంట్లు పెడుతున్నారు. మూడ విశ్వాసాలను నమ్ముకుంటే కొంప కొల్లేరే అని కొందరు, ఇది ఫేక్ వీడియో అని కొందరు. అతి అనర్థం అని మరికొందరు, ఇంతకీ ఆ పండితుడు ఎవడు అని కొందరు, పండితుడి కళ్లు చల్లబడ్డాయా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
కానీ, పిచ్చి ఉండకూడదు అన్న మాట అర్థం, వాస్తు శాస్త్రాన్ని అతి నియమాలుగా, అధికంగా ధీమాగా తీసుకోకూడదు. ఇలాంటిది మరింత ఉత్కంఠకు, అశాంతికి దారితీస్తుంది. ప్రతి పరిస్థితిలోనూ లాజిక్, ప్రామాణికతను పాటించడం మంచిది.
వాస్తు శాస్త్రంపై çకొన్ని సూచనలు:
పద్ధతులు ప్రామాణికంగా ఉండాలి
వాస్తు శాస్త్రం కొన్ని పద్ధతులను సూచిస్తుంది, కానీ వాటిని అతి కఠినంగా అనుసరించకండి. కొన్ని సందర్భాల్లో మీరు మీ సమయాన్ని, ప్రాధాన్యతను, మరియు వాస్తవాన్ని అనుసరించి ప్రామాణిక మార్గాలను తీసుకోవచ్చు.
మానసిక శాంతి కోసం
వాస్తు శాస్త్రం అనేక మందికి శాంతిని అందిస్తుంది, కానీ దానిని మీరు తక్షణం అనుసరించకపోతే, కేవలం మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
నమ్మకం వుండాలి కానీ..
కొన్నిసార్లు, మనకు విశ్వసించదగిన శాస్త్రాలను పాటించడానికి, అదృష్టాన్ని కాపాడుకోవడానికి కొంత నమ్మకం అవసరం. కానీ ఆ నమ్మకం ఒక అబద్ధంగా లేదా పిచ్చిగా మారకూడదు.
వాస్తు శాస్త్రం పై నమ్మకం వుండొచ్చు కానీ పిచ్చి వుండకూడదు…
మీ ఇంటికి వాస్తు దోషం ఉంది ఈ పిల్లర్ ఇక్కడ ఉండకూడదు, దీన్ని తొలగిస్తే నీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అని వాస్తు విద్వాంసుని మాటలు విన్న ఇంటి ఓనరు ఆ పిల్లరు తొలగించే ప్రయత్నం చేస్తే ఏమయ్యిందో చూడండి. బెంగళూరు లో జరిగిన… pic.twitter.com/mptefqfjNA
— (@dmuppavarapu) December 26, 2024