Money9 Mega Survey: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనుషుల కోరికలు కూడా పెరుగుతుంటాయి. దానికి ఫలితంగానే తయారీ కూడా పెరుగుతుంది. వ్యాపారస్థులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారీ చేస్తున్నారు. రాబోయే ఆరు నెలల్లో ప్రజల కోసం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, చండీగఢ్, గుజరాత్ లలో ఎక్కువగా ఉన్నాయట. అయితే వచ్చే ఆరు మాసాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ డిమాండ్ ఎలా ఉండనుంది? అనేది మనీ9 పర్సనల్ ఫైనాన్స్ సర్వే నుంచి ఈ విషయాలకు సంబంధించి కొన్ని సూచనలు తెలుసుకోవచ్చట. ఈ సర్వే ఇండియాలో భారతీయులకు ఎన్ని ద్విచక్ర వాహనాలు, కార్లు కొనాలనుకుంటున్నారు అనేది సర్వేలో తెలిసిందట.
ఈ సర్వే ప్రకారం 10 శాతం భారతీయ కుటుంబాలు వచ్చే ఆరు నెలల్లో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారట. ఈ కుటుంబాలు ఎక్కువగా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, చండీగఢ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయని టాక్. 4శాతం కుటుంబాలు 12 నెలల్లో విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారట. వీరందరూ ఎక్కువగా కర్ణాటక, గుజరాత్, చండీగఢ్, ఒడిశా, పంజాబ్ లలో ఉన్నారు. ఇక జీప్, కారు, వ్యాన్ లు కొనాలని 3శాతం కుటుంబాలు ఆలోచిస్తున్నారట. వీరు ఎక్కువగా జమ్మూ కాశ్మీర్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటకలో అత్యధికంగా ఉన్నారని సర్వే తెలిపింది.
టూ విలర్ కొనాలని కూడా ప్లాన్ చేసేవారు ఎక్కువ మొత్తంలోనే ఉన్నారట. వీరు ఎక్కువగా అస్సాం, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లో ఉన్నారు. అయితే ఈ మనీ 9 పర్సనల్ ఫైనాన్స్ సర్వే ఆగస్టు నుంచి నవంబర్ వరకు దేశంలోని 20 రాష్ట్రాల్లో 115 కంటే ఎక్కువ జిల్లాలో జరిగిందట. ఈ సర్వేను 10 వేర్వేరు భాషల్లో నిర్వహించారు. దేశంలోని 1140 గ్రామాలను. పట్టణ వార్డులను కవర్ చేశారట.