Mohan Babu: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక గొప్ప రైటర్ ను కోల్పోయింది. ఆయన చనిపోయి రోజులు గడుస్తున్నా ఇంకా జ్ఞాపకాలను సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతీ సందర్భంలో ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా నటుడు మోహన్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎమెషనల్ వ్యాఖ్యలు చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయం సందర్శనార్థం మోహన్ బాబు ఫ్యామిలీ వెళ్లలేదట.. ఎందుకంటే మోహన్ బాబు సొంత తమ్ముడు మరణించడతో ఆయన కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ‘రుద్రంకోట’ సినిమా కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు సిరివెన్నెల గురించి భావోద్వేగానికి గురయ్యారు.
‘సిరివెన్నెల గారి మరణంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇంట్లో జరిగిన సంఘటన వల్ల అక్కడికి వెళ్లలేకపోయాం. కానీ ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయనను ఇండస్ట్రీ మరిచిపోయినా ఆయన రాసిన పాటలు ముందు ముందు కూడా వింటారు. పరిశ్రమలో వరుసగా విషాధ సంఘటనలు చోటు చేసుకోవడం నన్నెంతో బాధకు గురిచేస్తోంది’ అని అన్నారు.
Also Read: కత్రినా- విక్కీ వివాహ వేడుకలో సెలబ్రిటీలకు కఠినమైన రూల్స్.. అవేంటో తెలిస్తే షాక్?
రుద్రం కోట సినిమాపై మోహన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘చిన్న సినిమాలే ఇండస్ట్రీని కాపాడుతాయిన మా గురువుగారు చెప్పారు. ప్రతి ఒక్కరు చిన్నస్థాయి నుంచే పెద్ద స్థాయికి వస్తారు. అలాగే కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్ అని ఎవరూ ఫీల్ కావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొదటి సినిమా కొత్తగానే ఉంటుంది. మేం కూడా కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరువాత ఇండస్ట్రీలో స్థిరపడ్డాం. అందువల్ల కొత్త అని ఫీల్ కాకుండా మంచి సినిమాలు తీయాలి. అప్పుడే పైకి ఎదుగుతారు.’ అని మోహన్ బాబు అన్నారు.
‘ఒక సినిమాలో ప్రతి ఒక్కిరికీ ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే నిర్మాత హ్యాపీగా ఉంటే సినీ ఇండస్ట్రీ బాగుపడుతుంది. నిర్మాత బాగు గోసం మిగతావారు వారి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తే సరిపోతుంది. అయితే మేం సినిమాలు తీసే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డాం. గుడిసెల్లో నివసిస్తూ సినిమాలు తీయాల్సి వచ్చింది. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా మంచి మంచి సినిమాలు తీశాం. కానీ ఇప్పుడున్న సౌకర్యాలతో గొప్ప సినిమాలు చేయాలి’ అని ఇండస్ట్రీ తీరుపై మోహన్ బాబు విసుర్లు కురిపించారు.
Also Read: మనం మనం భాయ్ భాయ్… స్టార్ హీరోలందరూ కలిసిపోయారా!