Modi Mango : పండ్లల్లో రారాజు మామిడి. అరచేతిలో ఇమిడే విధంగా.. ఆకర్షణీయంగా.. ఉండే మామిడి వేసవిలో ఎక్కువగా వస్తుంది. భారతదేశంలో 30కి పైగా రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిలో కేసరి, అల్ఫోన్సో ,దసరి, హిమాసాగర్ వంటివి ప్రఖ్యాత గాంచినవి. తెలుగు రాష్ట్రాల్లో భంగినపల్లి మామిడి ఎక్కువగా పండిస్తున్నారు. అయితే లేటేస్టుగా ‘నరేంద్ర మోదీ మామిడి’ మార్కెట్లోకి వస్తుంది. వినడానికి కొత్తగా అనిపించినా.. ఇది నిజమే. కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా నరేంద్ర మోదీ పేరు మీద కొత్త రకం మామిడిని పండించారు. వీటిని త్వరలో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. మరి మోదీ మామిడి గురించి తెలుసుకుందామా..
అవధ్ ఆమ్ ప్రొడ్యూసర్స్ అండ్ హార్టి కల్చర్ కమిటీ ఆధ్వర్యంలో మోదీ మామిడిని పండించారు. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన ముద్ర వేశారని, అందుకే దీనికి నరేంద్ర మోదీ అని పేరు పెట్టామని హార్టి కల్చర్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ఆ సమయంలో కొత్తరకం మామిడిని కనుగొనేందుకు కొన్ని పరిశోధనలు జరిగాయి. ల్యాబ్ లు పరిక్షించిన తరువాత ఒక కొత్త రకాన్ని ఉత్పత్తి చేశారు. అయితే దీనిని ఏ పేరు పెడుదామా? అని అనుకుంటున్న తరుణంలో నరేంద్ర మోదీ పేరు పెట్టాలని కొందరు సూచించారు. దీంతో దీనిని ఆయన పేరును డిక్లేర్ చేశారు.
2024లో ఈ మామిడి కాయలు కాతకు రానున్నాయి. అప్పుడు దీని రుచిని ప్రజలు చూస్తారని ఉపేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. మిగతా పండ్ల కంటే ఈ రకం మామిడి అత్యంత స్వీట్ ఉంటుందని అన్నారు. ఈ రకం చెట్టు విలువ వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయినా దీనిని దేశంలోని ప్రతీ మూలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి 100 చెట్లను పెంచామని, ఆ తరువాత మరిన్ని చెట్లు పెంచుతామని హార్టీకల్చల్ అధికారులు చెబుతున్నారు.
మామిడి రకాలు ఎన్నో వచ్చినా అందులో కొన్నింటిని మాత్రమే ఆదరిస్తున్నారు. పైగా కొన్న రకాలు ఆయా ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. కానీ మోదీ మామిడిని ప్రతీ జిల్లాల్లో పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అన్ని వాతావరణాల్లో ఇవి పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రత్యేకంగా మోదీ పేరు పెట్టడంపై కొందరు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక మిగతా మామిడి పండ్లకంటే దీని ధర ఎక్కువగానే ఉంటుంది. అంటే ప్రస్తుతానికి కేసరి పండ్లు అత్యంత ఖరీదైనవి.. అంతకంటే ఎక్కువే ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.