https://oktelugu.com/

SS Rajamouli-Ravi Teja : క్రేజీ అప్డేట్… రాజమౌళి-రవితేజ కాంబోలో మరో మూవీ.. త్వరలో సెట్స్ పైకి..

‘టైగర్ నాగేశ్వర్ రావు’  తరువాత రవితేజ సుధీర్ వర్మతో కమిట్ అయ్యారు.ఇప్పటికే వీరిద్దరు కలిసి రావాణసురతో వెండితెరపైకి వచ్చారు. అయితే మరోసారి ఈ కాంబో కలవనుంది.  త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ తరుణంలో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రవితేజ తో ఈసారి సుధీర్ వర్మ తీయబోయే చిత్రాన్ని పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాడట. సరికొత్త కథతో పాటు మేకింగ్ లో చాలా మార్పులు చేయనున్నారట.

Written By:
  • Srinivas
  • , Updated On : May 23, 2023 / 12:41 PM IST
    Follow us on

    SS Rajamouli-Ravi Teja : టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా కోసం ఎదురుచూడని వారు ఉండరు. ఆయన సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఉండే జోషే వేరు. జక్కన్న సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యే ఆవురావురుమంటూ ఈగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. కానీ నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.   వచ్చే డిసెంబర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలో దిగ్గజ దర్శకుడి గురించి ఓ హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. ఓ వైపు మహేష్ తో ప్రాజెక్టు చేస్తూనే.. మరోవైపు రవితేజ మూవీతో కమిట్ అయ్యాడట. ఆ వివరాలేంటో చూద్దాం..

    ధమాకా బంపర్ హిట్టు తరువాత మాస్ మహరాజ రవితేజ పాంలోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ తరువాత రిలీజైన ‘రావాణాసుర’ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. దీంతో ఈయన బిజీగా ఉన్నాడు. లేటేస్టుగా ఆయన  ‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే మూవీ కోసం పనిచేస్తున్నాడు. ఇందులో రవితేజ ఊర మాస్ లుక్ ను ఇప్పటికే లీక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మే 24న రాజమండ్రి బ్రిడ్జిపై రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై నిర్మిస్తున్న దీనిని వంశీ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇందులో  నుపూర్ సనన్ హీరోయిన్. ఇందులో గడ్డంతో ఉన్న రవితేజను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఆయన సినిమాలోవాటన్నింటికంటే ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో ఎమోషనల్ అవుతున్నారు.

    ‘టైగర్ నాగేశ్వర్ రావు’  తరువాత రవితేజ సుధీర్ వర్మతో కమిట్ అయ్యారు.ఇప్పటికే వీరిద్దరు కలిసి రావాణసురతో వెండితెరపైకి వచ్చారు. అయితే మరోసారి ఈ కాంబో కలవనుంది.  త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ తరుణంలో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రవితేజ తో ఈసారి సుధీర్ వర్మ తీయబోయే చిత్రాన్ని పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాడట. సరికొత్త కథతో పాటు మేకింగ్ లో చాలా మార్పులు చేయనున్నారట.

    ఇందుకోసం ఆయన రాజమౌళి సలహా తీసుకోనున్నాడట. రాజమౌళి-రవితేజల కాంబోలో విక్రమార్కులు వచ్చిన విషయం తెలిసింది. కుదిరితే ఎప్పటికైనా రవితేజతో మరో సినిమా చేయడానికి రాజమౌళి సిద్ధంగా ఉన్నాడు. కానీ సమయం పరిపోవడం లేదు. అయితే సుధీర్ వర్మ తీసే చిత్రానికి రాజమౌళి విలువైన సూచనలు ఇవ్వడనున్నాడట. అంటే పరోక్షంగా రవితేజ సినిమాకు జక్కన్న ఇన్వాల్స్ అవుతున్నాడన్న మాట. మరోసారి రాజమౌలి సూచనలతో వచ్చే ఆ సినిమాలో  రవితేజ ఎలా అలరిస్తాడో చూడాలి..