https://oktelugu.com/

ప్రతి ఒక్కరి ఖాతాలో లక్ష రూపాయలు వేస్తున్న మోదీ.. నిజమేనా..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరైనా కావాలని పుట్టిస్తున్నారో లేక ఆ వార్తలు వైరల్ కావడం వెనుక ఎవరైనా ఉన్నారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలామంది ప్రజలు వైరల్ అవుతున్న వార్తలను నిజమేనని నమ్మి ప్రచారం చేస్తూ ఉండటం గమనార్హం. కరోనా, లాక్ డౌన్ వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 26, 2020 / 10:41 AM IST
    Follow us on


    ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరైనా కావాలని పుట్టిస్తున్నారో లేక ఆ వార్తలు వైరల్ కావడం వెనుక ఎవరైనా ఉన్నారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలామంది ప్రజలు వైరల్ అవుతున్న వార్తలను నిజమేనని నమ్మి ప్రచారం చేస్తూ ఉండటం గమనార్హం. కరోనా, లాక్ డౌన్ వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

    Also Read: దేశవ్యాప్తంగా ఆగిపోనున్న రైళ్లు.. వాట్సాప్ పోస్ట్ వైరల్..?

    కరోనా దేశంలోని లక్షల సంఖ్యలో ఉద్యోగులను నిరుద్యోగులను చేసింది. వైరస్ విజృంభణ వల్ల గతంతో పోలిస్తే వ్యాపారాలు చేసేవాళ్లకు గణనీయంగా లాభాలు తగ్గాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం సరైన ప్రాజెక్టులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దేశంలోని స్టార్టప్ కంపెనీలు చాలావరకు మూతబడ్డాయి. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కరోనా ఫండింగ్ ద్వారా ప్రతి ఒక్కరికీ డబ్బులు ఇస్తోందని ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది.

    Also Read: రఘునందన్ రావును ఏకిపారేస్తున్న వైసీపీ

    18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరి ఖాతాలో మోదీ సర్కార్ నగదు జమ చేయనుందని మెసేజ్ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న మెసేజ్ లో వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్పందించి స్పష్టతనిచ్చింది. కరోనా ఫండింగ్ పేరుతో మోదీ సర్కార్ ఎవరి ఖాతాలో నగదు జమ చేయడం లేదని ఇలాంటి వార్తలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన రాలేదని తెలిపింది.

    మరిన్ని వార్తల కోసం: రాజకీయాలు

    ప్రజలు ఇలాంటి ఫేక్ మెసేజ్ లతో అప్రమత్తంగా ఉండాలని.. డబ్బులు వస్తున్నాయనే కారణంతో బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎవరికి పడితే వాళ్లకు ఇస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని నిపుణు చెబుతున్నారు. అందువల్ల వైరల్ అవుతున్న మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.