Site icon OkTelugu

మారడోనా మృతిపై మోదీ సంతాపం

ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఫుట్ బాల్ మైదానంలో మారడోనా తన కేరీర్ లో ఎన్నో అత్యుత్తమ క్రీడా అద్భుతాలను సృ ష్టించాడన్నారు. మారడోనా ఆకస్మిక మరణం అందరినీ కలిచివేసిందన్నారు. ఫుట్ బాల్ ఆటలో మారడోనాకు ప్రపంచవ్యప్తంగా మంచి పాపులారిటీ ఉందని ప్రధాని ట్విట్టర్ లో పోస్టు చేశారు. కాగా గుండెపోటుతో మారడోనా బుధవారం రాత్రి మరణించారు. మారడోనా మరణం పట్ల అర్జెంటీనా ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

Exit mobile version