https://oktelugu.com/

Mobile Tailoring: ద్విచక్ర వాహనాన్ని అలా మార్చేసి..ఆయన ఆలోచన అదుర్స్!

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరు కు చెందిన షేక్ అలీషా టైలర్ వృత్తితో గడుపుతున్నాడు. చాలా ఏళ్లు కిందట టైలరింగ్ షాప్ పెట్టి జీవనం సాగిస్తున్నాడు. అయితే క్రమేపి టైలరింగ్ కు ఆదరణ తగ్గుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 3, 2025 / 03:15 PM IST

    Mobile Tailoring

    Follow us on

    Mobile Tailoring: టైలర్ లేని సమాజాన్ని ఊహించలేం. శరీరాన్ని అందంగా తీర్చిదిద్దేవి దుస్తులు. మనుషుల ఆడంబరంతో పాటు సంస్కారాన్ని కూడా తెలియజేస్తాయి. మానవజాతి చరిత్రలో ఎప్పటి వరకు చేసిన అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఆవిష్కరణలో కుట్టుమిషన్లు ఒకటి. మనుషుల ఆత్మాభిమానాన్ని, శరీరంలో ఉన్న గోప్యత అవయవాలను దాచేవి దుస్తులు. అటువంటి దుస్తులను కుట్టేవి మిషన్లు. అందుకే అలా వర్ణించాల్సి వచ్చింది. మనదేశంలో టైలర్ వృత్తిపై ఆధారపడి జీవించే వారు చాలామంది ఉన్నారు. కానీ రెడీమేడ్ బట్టల పుణ్యమా అని టైలర్లకు చేతినిండా పని లేకుండా పోతోంది. ఉపాధి గగనం అవుతోంది. పూట గడవని స్థితిలో కొంతమంది టైలర్లు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తరుణంలో వినూత్న ఆలోచన చేశాడు ఓ టైలర్. ఏకంగా మొబైల్ టైలరింగ్ షాప్ ను ప్రారంభించాడు. ప్రజల ఇంటి వద్దకే వెళ్లి బట్టలు కుట్టడం ప్రారంభించాడు.

    * తగ్గిన ఆదరణ
    కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరు కు చెందిన షేక్ అలీషా టైలర్ వృత్తితో గడుపుతున్నాడు. చాలా ఏళ్లు కిందట టైలరింగ్ షాప్ పెట్టి జీవనం సాగిస్తున్నాడు. అయితే క్రమేపి టైలరింగ్ కు ఆదరణ తగ్గుతోంది. దీంతో వృత్తి గిట్టుబాటు కావడం లేదు. కుటుంబ జీవనం కూడా కష్టంగా మారింది. షాపు ఎత్తివేసి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిపోవాలని భావించాడు. అయితే తెలిసిన వృత్తి టైలర్ కావడంతో.. మరో పని లేక అదే వృత్తిలో కొనసాగాలని భావించాడు. అందుకోసం వినూత్న ఆలోచన చేశాడు.

    * మొబైల్ కుట్టు మిషన్
    షేక్ అలీషా వద్ద టీవీఎస్ ద్విచక్ర వాహనం ఉంది. దానినే మొబైల్ షాప్ గా మార్చేశాడు. ద్విచక్ర వాహనాన్ని ముందు పెట్టి.. వెనుక చక్రాలతో ఒక ప్లాట్ఫారం తయారు చేశాడు. దానిపై కుట్టు మిషన్ ఏర్పాటు చేసి.. రోజుకో గ్రామం వెళ్తూ బట్టలు అక్కడికక్కడే కుట్టి అందిస్తున్నాడు. అలా ఉపాధి పొందుతున్నాడు. చినిగిపోయిన బట్టలతోపాటు కొత్త దుస్తులు కుట్టించాలనుకున్నవారు నేరుగా అలీషా కు ఫోన్ చేస్తున్నారు. ఆయన అక్కడకు వెళ్లి దుస్తులు కుడుతున్నాడు. ఈ మొబైల్ కుట్టు మిషన్ ఏర్పాటుతో కొంత గిట్టుబాటు అవుతోందని చెబుతున్నాడు.