Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు మహేష్ బాబు మేకోవర్ మీద చాలా శ్రద్ధ తీసుకున్న రాజమౌళి ఇప్పటినుంచి తను చేయబోయే సినిమాకు సంబంధించిన సీన్స్ ఎలా చత్రీకరించాలనే దానిమీద టెక్నీషియన్స్ తో కలిసి భారీ కసరత్తులు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ లో మహేష్ బాబు షర్టు విప్పి నటించాల్సి ఉంటుంది. ఇక దాంతో పాటు అతనికి సిక్స్ ప్యాక్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే మహేష్ బాబు సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసినప్పటికి అది అతనికి సెట్ అవ్వలేదని ఉద్దేశ్యంతో కొంతమంది దర్శకులు సిక్స్ ప్యాక్ ను చూపించలేకపోయారు. మరి రాజమౌళి మహేష్ బాబు సిక్స్ ప్యాక్ ను పక్కాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. రాజమౌళి తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇప్పటివరకు అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలను సుసాధ్యం చేసి చూపించాడు. కాబట్టి మహేష్ బాబు సిక్స్ ప్యాక్ ను కూడా అలాగే చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే మహేష్ బాబు కూడా దానికి అంగీకరించాడా లేదా అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి.
మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా 2027 వ సంవత్సరంలో రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక సంక్రాంతి తర్వాత నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. అయితే వీలైనంత ఫాస్ట్ గా సినిమా షూటింగ్ ను ముగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక పాన్ వరల్డ్ లో వస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా ఇందులో భాగం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక రాజమౌళి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే. ప్రతి సీను కూడా చాలా క్షుణ్ణంగా తెరకెక్కిస్తూ ఉంటాడు. అందుకే అతని సినిమాల్లో ప్రతి పాయింట్ కూడా చాలా క్వాలిటీ గా ఉంటుంది. మరి ఈ సినిమాను కూడా ఎన్ని రోజులు చిత్రీకరిస్తాడనేది తెలియాల్సి ఉంది…