Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు ఇటు టాలీవుడ్ పెద్దల నుంచి పొలిటీషియన్స్ వరకూ ఈ వివాదంపై స్పందించేందుకు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే అందరూ బయటపడుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సంధ్య థియేటర్ వ్యవహారంలో అల్లు అర్జున్ ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు.
ఇక బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా అల్లు అర్జున్ తప్పు ఈ విషయంలో అసలే లేదని.. ఆయన అరెస్ట్ ను ఖండించారు. దీనికి తగ్గట్టుగానే ఈ వ్యవహారంలో అసలు నిర్లక్ష్యం వహించిన పోలీసులకు ఎన్.హెచ్.ఆర్సీ నోటీసులు పంపడం కేసును మలుపు తిప్పింది. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించింది. లాఠీచార్జి చేసిన వైనంపై ఆగ్రహించింది.
అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేకున్నా ఆయన మెడకు చుట్టాలన్న ప్రయత్నంతో ఇప్పుడు టాలీవుడ్ లో గళాలు లేస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.
అల్లు అర్జున్ అరెస్ట్ తో ఎవరికి నష్టం? అన్న దానిపై ఈ రివ్యూ చూడండి