Minister Roja: అటు హీరోయిన్ గా వెలుగు వెలిగింది. అనంతరం బుల్లితెరపై రఫ్పాడించింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఎదిగింది. తొలి జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశ చెందింది. కానీ సెకండాఫ్ లో రోజాకు మంత్రి పదవి లభించింది. క్రీడలు , సాంస్కృతిక శాఖ లభించడంతో ఇప్పుడు తనదైన శైలిలో దూసుకెళుతోంది. ఈ కార్యక్రమాల్లో తనే ముందుండి నడుస్తోంది.

ఇటీవల తిరుపతిలో జరిగిన కళోత్సవాల్లో గిరిజన బాలికలతో కలిసి రోజా చేసిన డ్యాన్స్ ను ఎవరూ మరిచిపోలేదు. ఇప్పుడు ఏకంగా గ్రామీణ బాలికల క్రీడల్లో కబడ్డీతో చెడుగుడు ఆడేసింది.
సొంత నియోజకవర్గం నగరిలో క్రీడా సంబరాలను ప్రారంభించిన రోజా పలు ఆటలను ఆడి అలరించింది మంత్రి రోజా. క్రీడాకారిణులను ప్రోత్సహించడానికి
ఏపీ మంత్రి రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. నగరి డిగ్రీ కాలేజీలో క్రీడా సంబరాలను ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు క్రీడలను ఆడి అలరించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఆడారు. విద్యార్థినులను ఆమె ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా రోజా కబడ్డీ ఆడుతూ రెయిడ్ కు వెళ్లారు. అవతలి జట్టులో ఉన్న అమ్మాయిలు రోజాను టాకిల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వెల్లికిలా కిందకు పడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అలా కిందపడేస్తారా? అంటూ అధికారులు, ఆమె అనుచరులు విద్యార్థినులను అంటుండగా… రోజా కలగజేసుకుని ఎవరినీ ఏమనొద్దని వారించారు. అనంతంర సారీ చెప్పిన విద్యార్థీనిలను ఏం పర్లేదు అంటూ ప్రోత్సహించారు. అంతేకాదు, స్పోర్టివ్ స్పిరిట్ తో ఆమె మరో రెయిడ్ కు కూడా వెళ్లారు. అమ్మాయిలను రోజా ప్రోత్సహించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.