Minister Malla Reddy- IT Raids: “కేంద్రంలో వచ్చేది కెసిఆర్ ప్రభుత్వమే.. కెసిఆర్ ప్రధానమంత్రి అయినంక ఇన్కమ్ టాక్స్ లాంటివి ఉండయి. ఎవలు ఎంతైనా సంపాదించుకోవచ్చు. దర్జాగా పన్ను లు చెల్లించొచ్చు” ఇటీవల మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈడి మళ్లీ స్ట్రైక్ మొదలు పెట్టింది.. ఈసారి మల్లారెడ్డి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది.. 100 కోట్ల డొనేషన్ లపై ఫోకస్ పెట్టి.. మల్లారెడ్డి అల్లుడు, చిన్న కొడుకును విచారించింది. మరో 10 మందికి సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 5 వరకు విచారణ సాగించనుంది.

మొత్తం 16 మందికి సమన్లు
మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆయన అనుచరుల నివాసాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు మొత్తం 16 మందికి సమన్లు జారీ చేశారు. తొలి మూడు రోజులు విస్తృతంగా దాడులు చేసిన అధికారులు… పత్రాలు, డాక్యు మెంట్లు స్వాధీనం చేసుకున్నారు.. దాడులు జరిగిన మొదటి మూడు రోజుల్లో ఎటువంటి వివరాలు బయటకు చెప్పని ఈడి అధికారులు.. తర్వాత మల్లారెడ్డి కి అసలు సినిమా చూపిస్తున్నారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కోట్ల నగదు అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారని.. సమాచారం ఉన్నది. సమయంలో మల్లారెడ్డి ఇళ్లల్లో దొరికిన 10 కోట్లకు సంబంధించి ఇంకా వివరాలు లభ్యం కాలేదు. వీటిపై కూడా అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
ఆ 100 కోట్లపై నజర్
మల్లారెడ్డికి కీలక ఆదాయ వనరు వైద్య కళాశాలలు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి డొనేషన్లు వసూలు చేస్తున్నారని మల్లా రెడ్డి విద్యాసంస్థలపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి.. ముఖ్యంగా బి కేటగిరి సీట్ల విషయంలో కోట్లలో డొనేషన్లు వసూలు చేశారని సమాచారం. ఈడి అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు 100 కోట్ల మేర డొనేషన్లు వసూలు చేసినట్టు వారి దృష్టికి వచ్చింది. దీనిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా… డొనేషన్లు వసూలు చేసింది నిజమే అని తేలింది. క్రమంలో సోమవారం మల్లారెడ్డి కుటుంబ సభ్యులను, అతడి వ్యాపార భాగస్వాములను అధికారులు విచారించారు. మంత్రి మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డి , ఎమ్ ఎల్ ఆర్ కాలేజీ చైర్మన్ నరసింహారెడ్డి, నరసింహారెడ్డి కొడుకు త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజీ చైర్మన్ రామస్వామి రెడ్డి, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ శివకుమార్ రెడ్డి, మెడికల్ కాలేజ్ అకౌంటెంట్, ప్రిన్సిపాల్ మాధవి, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మహిళా అకౌంటెంట్, రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరో అకౌంటెంట్ విచారణకు హాజరయ్యారు. వీరుని ఎనిమిది గంటల పాటు అధికారులు విచారించారు.. అయితే డొనేషన్లు వసూలు చేసిన వారిలో మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఆ వంద కోట్లతో ఏం చేశారని అధికారులు పదే పదే ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

కీలక సమాచారం సేకరణ
మొదటి రోజు విచారణకు హాజరైన 12 మంది నుంచి ఐటీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు.. దాని ఆధారంగా మరో 10 మందికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.. విడతల వారీగా డిసెంబర్ 5 వరకు విచారణ సాగించనున్నట్టు తెలుస్తోంది.. మంగళవారం మల్లారెడ్డి తరఫున ఆయన ఆడిటర్ విచారణకు హాజరయ్యారు.. ఈ కేసులో మొత్తం 26 మందికి సమన్లు జారీ చేశారు.. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ సోమవారం జరిగిన విచారణకు మంత్రి మల్లారెడ్డి హాజరు కాకపోవడం గమనార్హం.