Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్స్, కామెంట్స్ ఆటం బాంబ్స్ లా పేలుతూ ఉంటాయి. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తత్వం ఆసక్తి రేపుతూ ఉంటుంది. తాజాగా బండ్ల గణేష్ తన ట్వీట్ తో ఆసక్తికర చర్చకు తెరలేపారు. విషయంలోకి వెళితే… పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ వీరాభిమానన్న విషయం తెలిసిందే. ఆయన్ని దేవుడిగా బండ్ల పూజిస్తారు. పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ ఇచ్చే ఎలివేషన్ కాకలు తీరిన కవులు కూడా ఇవ్వలేరు. అంతగా గుండెల్లో నుండి ఆరాధిస్తాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బండ్ల గణేష్ అంటే వల్లమాలిన అభిమానం. వారు బండ్ల గణేష్ ని ఎంతగానో ఇష్టపడతారు.

ఇక పవన్ అభిమానిగా బండ్ల గణేష్ జనసేన పార్టీ సానుభూతిపరుడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. పవన్ ను ఉద్దేశించి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే బండ్ల గణేష్ రియాక్ట్ అవుతారు. పవన్ కి మద్దతుగా ఎదుటివాళ్ళ కామెంట్స్ కి కౌంటర్లు వేస్తారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ జనసేన పార్టీలో అధికారికంగా చేరకున్నా… ఫ్యాన్స్ ఆ పార్టీవాడిగా పరిగణ చేస్తారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ మంత్రి రోజా మాట్లాడారు. ఈ నేపథ్యంలో రోజాకు సమాధానం చెప్పాలంటే బండ్లన్నే సరైనోడు అంటూ… ఆయన పాత వీడియో ఒక అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియోని కోట్ చేస్తూ బండ్ల గణేష్ ఊహించని కామెంట్స్ చేశారు. రాజకీయాల వలన నేను చాలా నష్టపోయాను. ప్రస్తుతం నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే అంటూ కామెంట్ చేశారు. ఇది ఒకింత పవన్ అభిమానులను నిరాశకు గురి చేసింది. అంత మాట అనేశావు ఏంటి అన్నా? అని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా 2018లో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. టీఆర్ఎస్ ప్రభంజనంలో ఆయన ఓడిపోయారు.

అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది చెప్పిన బండ్ల గణేష్… రాకుంటే నాలుక కోసుకుంటానని శబధం చేశాడు. అప్పట్లో బండ్ల గణేష్ కామెంట్ తెగ వైరల్ అయ్యింది. ఇక నాలుక ఎప్పుడు కోసుకుంటున్నారని మీడియా అడిగితే, ఆవేశంలో అనేకం అంటాం.. అంత మాత్రానా నిజంగా చేసేస్తామా అని బండ్ల గణేష్ సమర్ధించుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలని బండ్ల గణేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయన కోరిక ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.
రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అందరూ ఆత్మీయులే 🙏🙏🙏 https://t.co/ecO3UFOFAu
— BANDLA GANESH. (@ganeshbandla) November 29, 2022