హాస్యం అంటేనే తెలుగు ప్రేక్షకుల జీవితంలో ఓ భాగం. అసలు ‘కన్యాశుల్కం’ లాంటి భారీ హాస్య నాటకం మరో భాషలో లేదు అంటేనే, తెలుగు వాళ్లకు హాస్యం పై ఎంత పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు ఆ మాటకొస్తే.. తెలుగు వారికి హాయిగా నవ్వుకోవడం చాలా సహజమైన విషయం. మొత్తానికి గిరీశం నించి బైరాగి దాకా అందరికీ గొప్ప వాగ్ధోరణి ఉందనేది గోదారి నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికి తెలుసు.
పైగా ప్రతి ఒక్క తెలుగు కథలో పాత్రలన్నీ లౌక్యంతోనో, ఆగ్రహంతోనో, అమాయకత్వంతోనో ప్రవర్తిస్తూ ముందుకు నడుస్తాయి. ఇక కరోనా వైరస్ పై రూపొందించిన ‘మైండ్ బ్లాక్’ పేరడీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఈ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ చాల బాగా హిట్ అయింది.
పాటకు ఎంత క్రేజ్ లభించిందో మీకు తెలిసిందే. అయితే, ఈ పాటకు సంబంధించిన ఈ పేరడీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కరోనా మహమ్మారి పై అవగాహన కలిగిస్తూ ఈ పాటలోని సాహిత్యం పేరడీగా మార్చి మొత్తానికి ఈ సాంగ్ ను వదిలారు. అయితే ఈ పాటకు సరిపడేలా సాహిత్యం ఉండటంతో అందరికీ ఈ సాంగ్ బాగా కనెక్ట్ అవుతుంది.
మరి ఈ ‘మైండ్ బ్లాక్’ హ్యండ్ వాష్ పూర్తి లిరిక్స్ ను మీరు కూడా చూడండి
ఎపుడూ రోడ్డెక్కేవాడూ.. ఇపుడూ ఇంట్లో ఉన్నాడు
ఎపుడూ చెయ్యిచ్చేవాడూ.. ఇపుడూ దండం పెడతాడు
మూతికేమొ మాస్కు కట్టి.. మాట గీట కట్టిపెట్టి,
స్టేహోం స్టే హోమని కూర్చున్నాడూ…
ఫర్ ది ఫస్ట్ టైమ్
ఆల్వేస్ ఇన్ ద హోమ్
బాబూ నువ్ సెప్పూ.. ఏంటీ?
ఆణ్ణి కడగమని హేండు..
నువ్ కడగరా
కలవమాకు.. కలవామాకు బాబు నువ్వెవరినీ కలవమాకు
తిరగమాకు.. తిరగమాకు.. అయ్య నువ్వు రోడ్డు మీద తిరగమాకు
అదొక ప్రాణాలు తీసే కొత్త బాకు.. బాక్కు
దేశదేశాలు తిరుగుతున్న స్నేక్.. స్నేక్కు
దాని లక్షణాలు విన్నవంటే షాక్.. షాక్కు
అమ్మో.. అయ్యో.. అవునా.. బాబాయో..
దాన్ని లేక్కచేయపోతే నీకు రిస్క్.. రిస్కు
ఫ్యూచరంటు ఉంటె చెప్పు నీకు రేపు.. రేపు
చెప్పినట్టు వింటే బతకుతావు బాసు.. బాస్సు
అవునా..అట్నా..సర్లే..చెప్పూ!
హ్యాండ్ వాష్.. హ్యాండ్ వాష్.. బాబు నువ్వు మరిచిపోకు హ్యాండ్ వాషు
హ్యాండ్ వాష్.. హ్యాండ్ వాష్.. బాబు నువ్వు మరిచిపోకు హ్యాండ్ వాషు
హ్యాండ్ వాష్.. హ్యాండ్ వాష్.. బాబు నువ్వు మరిచిపోకు హ్యాండ్ వాషు