Nani
Nani : 100% స్ట్రైక్ రేట్ అంటే మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గుర్తుకొస్తాడు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికలలో ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి సంచలన విజయం సాధించాడు కాబట్టి. ఆయన లాగానే సినీ ఇండస్ట్రీ లో 100 % స్ట్రైక్ రేట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజమౌళి(SS Rajamouli), అనిల్ రావిపూడి(Anil Ravipudi), సందీప్ వంగ(Sandeep Reddy Vanga) వంటి దర్శకులకు ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. తీసిన సినిమాలన్నీ హిట్టే. ఇప్పుడు వీళ్ళ జాబితాలోకి నేచురల్ స్టార్(Natural Star Nani) నాని కూడా చేరిపోయాడు. కానీ హీరో గా మాత్రం కాదు, నిర్మాతగా. ఇప్పటి వరకు ఆయన నిర్మించిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. ‘అ!’, ‘హిట్’, ‘హిట్ 2’, ‘కోర్ట్'(Court Movie). ఈ నాలుగు సినిమాలు గమనిస్తే, ఒక సినిమాని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి.
Also Read : పావలా పెట్టుబడికి రూపాయి లాభం… హీరో నాని పెద్ద ముదురు బాబోయ్!
ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన ‘కోర్ట్’ చిత్రం ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు. నిర్మాతగా డిఫరెంట్ సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నాని టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. శ్యామ్ సింగ రాయ్ చిత్రం నుండి ఆయన హీరో గా నటిస్తున్న సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్స్ అవుతూ వస్తున్నాయి. ఇకపోతే నాని భవిష్యత్తులో చేయబోయే సినిమాలన్నీ తన సొంత బ్యానర్ మీద నిర్మించబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘హిట్ 3’ చిత్రం మే1 న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. అదే విధంగా తనతో ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తీసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన హీరోగా నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటి వరకు చిన్న సినిమాలను నిర్మిస్తూ వచ్చిన నాని, ‘ది ప్యారడైజ్'(The Paradise) నుండి తన పరిధి ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ పెద్ద సినిమాల వల్ల లాభాలు ఎంత ఉంటుందో, తేడా జరిగితే నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అంటే నాని రిస్క్ తో గేమ్ ఆడుతున్నాడు అనే చెప్పాలి. ఈ గేమ్ లో ఆయన ఎంత వరకు సక్సెస్ అవ్వగలడో చూడాలి. ప్యారడైజ్ మూవీ షూటింగ్ సమాంతరం గా జరుగుతుంది. ‘హిట్ 3’ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్యారడైజ్ లో సీనియర్ నటుడు ఆర్ నారాయణమూర్తి ముఖ్య పాత్రలో నటిస్తాడని , మరో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు విలన్ గా నటిస్తాడని ఒక టాక్ ఉంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.
Also Read : నాని ప్రొడ్యూసర్ గా చేసి ఎంత సంపాదించాడో తెలుసా..?