Michael Collections: ఇండస్ట్రీ కి వచ్చి పదేళ్లు దాటుతున్నా కూడా ఇప్పటికీ స్థిరమైన మార్కెట్ లేని కుర్ర హీరో ఎవరు అంటే మన అందరికి గుర్తుకు వచ్చే పేరు సందీప్ కిషన్..కెరీర్ మొత్తం మీద ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అనే సినిమా మినహా ఇప్పటి వరకు ఒక్క సూపర్ హిట్ కూడా లేదు..స్టార్ హీరో గా ఎదగడానికి అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కనీస స్థాయి మార్కెట్ రాకపోవడం అనేది దురదృష్టకరం.

ఈసారి ఎలా అయినా భారీ హిట్ కొట్టడానికి మైఖేల్ అనే సబ్జెక్టు తో భారీ కాస్టింగ్ తో మన ముందుకు వచ్చాడు..టీజర్ మరియు ట్రైలర్ బాగుండడం తో ఓపెనింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చినప్పటికీ లాంగ్ రన్ విషయం లో మాత్రం భారీ గా దెబ్బ తినింది..రెండవ రోజు నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి..మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఈ చిత్రానికి హైపర్ ఉండడం వల్ల మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి..తెలుగు స్టేట్స్ లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ చిత్రం తమిళం లో 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.తమిళనాడు లో మొదటిరోజు 70 లక్షల గ్రాస్ అంటే మంచి ఓపెనింగ్ అనే చెప్పొచ్చు.విజయ్ సేతుపతి వంటి తమిళ స్టార్ హీరో ఉండడం వల్ల ఈ రేంజ్ ఓపెనింగ్ వచ్చిందని అంటున్నారు..రెండవ రోజు కూడా తమిళం లో మంచి హోల్డ్ సాధిస్తూ 75 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినప్పటికీ తెలుగు స్టేట్స్ లో మాత్రం 50 శాతం డ్రాప్స్ రావడం వల్ల కోటి 35 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..3 వ రోజు అయితే రెండవ రోజు కంటే మరో 50 శాతం కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం వల్ల 60 లక్షలు గ్రాస్ వచ్చింది.

అలా మూడు రోజులకు కలిపి నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్, రెండు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ చిత్రం, తెలుగు మరియు తమిళం కలిపి 3 రోజులకు 7 కోట్ల రూపాయిల గ్రాస్,3 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.. ఇలా వీకెండ్స్ లోనే ఈ రేంజ్ డ్రాప్స్ ఉన్న ఈ సినిమాకి నాల్గవ రోజు కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి..నాల్గవ రోజు ఈ సినిమాకి కేవలం 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. షేర్ 10 లక్షల లోపే అన్నమాట.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6 కోట్ల రూపాయిల వరకు జరిగింది. ఇప్పటి వరకు 3 కోట్ల 52 లక్షల షేర్ ని రాబట్టిన ఈ సినిమాకి మరో రెండు కోట్ల రూపాయిలకు పైగా షేర్ ని రాబట్టడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.. ఆ విధంగా సందీప్ కిషన్ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్ గా నిలిచింది ఈ మైఖేల్ చిత్రం.