
KCR- CBI: ‘మోదీ నువ్వు గోకినా గోకకున్నా.. నిన్ను గోకుతా.. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతా నీకు దర్యాప్తు సంస్థలున్నాయి.. నాకూ ఉన్నాయి.. కాస్కో చూసుకుందాం’ అని చాలెంచ్ చేసినట్లు ఎమ్మెల్యేలకు ఎర కేసలలోకి బీజేపీ అగ్రనేతలను ఢిల్లీ పెద్దలను లాగాలనుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కానీ ఇప్పుడు ఆ కేసు కేసీఆర్ దర్యాప్తు సంస్థ సిట్ చేతిలో నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేతికి వెళ్లింది. అంటే ఇప్పుడు బాల్ మోదీ కోర్టులోకి చేరిందన్నమాట. ఇన్నాళ్లుల ఆట కేసీఆర్ ఆడారు. ఇకపై ఆడేది మోదీ. అసలు ఆట ఇక ఇప్పుడే షురూ అయింది.
కేసీఆర్ కన్నా తోపు మోదీ..
తన వరకు వస్తే ఎవరినైనా టార్గెట్ చేయడం, తన్ని తరిమేయడం కేసీఆర్‌కు అలవాటు. తనను మించి ఎదిగే వారిని తొక్కేడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కానీ, ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయానికి వస్తే నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు. సింగిల్ బెంచ్.. డివిజన్ బెంచ్ తీర్పులతో ఇప్పటికే షాక్‌లో ఉన్న కేసీఆర్‌కు త్వరలోనే మోదీ షాక్ ఇవ్వడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సుప్రీంకోర్టులో ఊరట మాట దేవుడెరుగు..
తెలంగాణ హైకోర్టులో రెండుసార్లు ఎదురు దెబ్బలు తగిలిన కేసీఆర్ సర్కార్ ఎమ్మెల్యేల ఎర కేసు సిట్ దర్యాప్తు కొనసాగించేలా సుప్రీం తలుపు తట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అక్కడ ఊరట లభిస్తుందో లేదో తెలియదు. అంతలోనే సీబీఐ రంగంలోకి దిగడం ఖాయం అని సమాచారం. ఇక విచారణ నుంచి కేసీఆర్ మాత్రం తప్పించుకోవడం సాధ్యం కాదని న్యాయవర్గాలు ఓ అంచనాకు వచ్చేశాయి.
ట్రాప్ కూలీ లాగేలా..
ఫామ్ హౌస్ కేసు అత్యంత క్లిష్టమైనదేమీ కాదు.. కానీ ట్రాప్ అని స్పష్టంగా తెలుస్తోంది. పెద్దగా బీజేపీతో సంబంధాల్లేని ముగ్గుర్ని తెరపైకి తెచ్చి ఏకంగా బీజేపీ హైకమాండ్‌తో లింక్ పెట్టి .. కేసు కట్టేశారు. వందల కోట్లు అన్నారు కానీ రూపాయి కూడా పట్టుబడలేదు. ఇక కేసీఆర్ అత్యుత్సాహం వల్ల ఆయన కూడా ఇప్పుడు ఇరుక్కునే పరిస్థితి ఏర్పడింది. సాక్ష్యాలను ఆయన మీడియా సమావేశం పెట్టి రిలీజ్ చేశారు. వాటిలో ఉన్న కంటెంట్ వైరల్ కాలేదు కానీ.. ఆయన ఇలా చేయడం మాత్రం సీబీఐ దృష్టిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. నలుగురి ఎమ్మెల్యేల భుజాలపై సీబీఐ తుపాకీ పెట్టి కేసీఆర్‌ను షూట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐపీఎస్‌లకూ తిప్పలే..
ఇక .. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు కూడా ఇబ్బందులు పడనున్నారు. స్టీఫెన్ రవీంద్ర .. సీబీఐ గుప్పిట చిక్కడం ఖాయమని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా చేస్తూ రాజకీయ కుట్రలు చేస్తున్నారని స్టీఫెన్‌పై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సిట్‌కు నేతృత్వం వహించిన సీవీ.ఆనంద్‌ను కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సీబీఐ విచారణలో ముందుగా నలుగురు ఎమ్మెల్యేలనూ ప్రశ్నిస్తారు. ఈ సీబీఐ విచారణపై ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో అసలేం జరుగుతుందన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సీబీఐ విచారణ మొదలైతే అది కచ్చితంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ కేసును చూపించి బీజేపీ పెద్దలతో వైరం పెట్టుకోవడం.. వదిలేది లేదని హెచ్చరించినందున తమకు ఆయుధం అవుతుందనుకున్న ఏ కేసు నుంచి వారు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.