Flea Bite:
Flea Bite: కీటకాలు చూడడానికి చిన్నవిగా ఉంటాయి కానీ, వాటిల్లో కొన్ని చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. అవి ఒక్కసారి కుట్టాయంటే.. ఆరడుగుల ఆజానుభావుడు కూడా అల్లాడిపోవాల్సిందే. ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా.. ఓ కీటకం దెబ్బకు చావు అంచులదాకా వెళ్లి వచ్చాడు. డాక్టర్లు అందించిన మెరుగైన వైద్యం పుణ్యమా అని బతికి బట్టకట్టాడు కానీ.. కాళ్లు, చేతులు మాత్రం కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. మరి అతను ఎవరు.. అతడిని కుట్టిన ఆ విషపూరిత కీటకం ఏమిటో తెలుసుకుందాం.
కిట్టిన వెంటనే అస్వస్థత..
టెక్సాస్‌కు చెందిన 35 ఏళ్ల మైకేల్ కోల్‌హాఫ్‌ను జూన్‌లో ఓ చిన్న కీటకం కుట్టింది. అది కుట్టిన కొద్దిసేపటికే.. కడుపునొప్పి, వీరేచనాలు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి కాబట్టి.. అతడు ఆ లక్షణాల్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కేవలం సాధారణ మాత్రలు వేసుకుంటూ వచ్చాడు. అయితే.. వారం రోజుల తర్వాత అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. జూన్ చివరి వారంలో అయితే బెడ్ మీద నుంచి కనీసం లేవలేకపోయాడు. దీంతో.. సోదరుడు గ్రెగ్ వెంటనే అతడ్ని ఆసుపత్రిలో ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చేర్పించాడు.
సెప్టిక్ షాక్..
మైకేల్‌ని ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే సెప్టిక్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో వైద్యులు అతడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి, వెంటిలేటర్‌పై ఉంచారు. అసలు అతనికి వచ్చిన రోగమేంటే నిర్ధారించడానికి వైద్యులకు 24 గంటల సమయం పట్టింది. మైకేల్‌కి అనేక యాంటీబయాటిక్స్ అందించారు. డయాలసిస్ చేయడం కూడా ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాక మైకేల్ ‘డ్రై గ్యాంగ్రీన్’ బారిన పడటంతో.. ఒక అంగుళం వరకు కాలి వేళ్లు, ముంజేతుల వరకు చేతులను కత్తిరించారు.
డ్రై గ్యాంగ్రీన్ అంటే..
ఈ డ్రై గ్యాంగ్రీన్ అనేది.. కొన్ని అంత్య భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. మైకేల్ ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడటానికి కారణం.. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టైఫస్. ఇది మైకేల్‌ని కుట్టిన ఇన్‌ఫెక్టెడ్ ఈగల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు.
2,500 కీటక జాతులు..
వ్యాధి నియంత్రణ – నివారణ కేంద్రాల (సీడీసీ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువగా కీటక జాతులున్నాయి. ఒక్క అమెరికాలోనే 300 కంటే ఎక్కువ జాతులున్నాయి. అయితే.. వీటిల్లో కొన్ని మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే, అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Michael kohlhoff loses part of his foot and both arms due to a fly bite
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com