BJP 2024 Election: దేశంలో ప్రధాని మోడీ నేతృత్వంలోనే ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి. జూలై నెలలో దాదాపు రెండు సర్వేలు వెలువడ్డాయి. రెండింటిలో కూడా ఎన్డీఏ విజేతగా తేలింది. విపక్షాలు ఇండియా కూటమిగా తెరపైకి వచ్చినా ఆశించిన ప్రభావం చూపలేకపోవడం విశేషం.
తాజాగా ఇండియా టీవీ, సి ఎన్ ఎక్స్ దేశవ్యాప్తంగా ఒపీనియన్ పోల్ చేపట్టింది. ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు జరిగితే విజయం ఎవరిది అనేదానిపై అంచనా వేసింది.
543 లోక్ సభ స్థానాలకు గాను.. 318 సీట్లతో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ నేతృత్వంలోనే విపక్షాల కూటమి ఇండియాకు 175 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు తేలింది. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులతో సహా ఇతరులకు 50 సీట్లు రావచ్చు అని అంచనా వేసింది. కానీ బిజెపి బలం 303 సీట్లు నుంచి 290 సీట్లకు తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లనుంచి 66 సీట్లకు పెంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ లోఎన్డీఏకు 73 సీట్లు,ఇండియా కూటమికి ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీహార్ లో ఎన్డీఏకు 24, ఇండియాకు 16, మహారాష్ట్రలో ఎన్డీఏకు 24, ఇండియాకు 24, తమిళనాడులో ఎన్డీఏకి 9,ఇండియా కూటమికి 30, పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏకు 12,ఇండియా కూటమికి 30, కర్ణాటకలో ఎన్డీఏకు 20, ఇండియా కూటమికి 7, గుజరాత్ లో ఎన్డీఏకు 26, కేరళలో ఇండియా కూటమికి 20, రాజస్థాన్లో ఎన్డీఏకు 21, ఇండియా కూటమికి నాలుగు, ఒడిస్సాలో ఎన్డీఏకు 8,ఇతరులకు 13, మధ్యప్రదేశ్లో ఎన్డీఏకు 24, ఇండియా కూటమికి ఐదు, అస్సాంలో ఎన్డీఏ కి 12 ఇండియా కూటమికి ఒకటి, చత్తీస్గడ్ లో ఎన్డీఏకు 7, ఇండియా కూటమికి నాలుగు, ఝార్ఖండ్లో ఎన్డీఏకు 13, ఇండియాకు 1, హర్యానాలో ఎన్డీఏకు 8, ఇండియా కూటమికి రెండు, పంజాబ్లో ఇండియా కూటమికి 13, ఢిల్లీలో ఎన్డీఏ 5, ఇండియా కూటమికి రెండు, ఉత్తరాఖండ్లో ఎన్డీఏ 5, జమ్మూ కాశ్మీర్ లడక్ లో ఎన్డీఏ కి మూడు,ఇండియా కూటమికి రెండు, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్డీఏ కి మూడు, ఇండియా కూటమికి ఒకటి, మణిపూర్ లో ఇండియా కూటమికి రెండు సీట్లు లభించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీల వారీగా సీట్లు పరిశీలిస్తే.. బిజెపికి 295, కాంగ్రెస్కు 66, ఆమ్ ఆద్మీ పార్టీకి 10, టీఎంసీ కి 29, బీజేడి కి 13,శివసేన షిండే వర్గానికి 9, శివసేన ఉద్దవ్ వర్గానికి 11, సమాజ్వాది పార్టీకి నాలుగు, రాష్ట్రీయ జనతాదల్ 7, జనతాదళ్ ఎస్ 7, డీఎంకే 19, ఎన్సీపీ శరద్ పవర్ వర్గానికి 4, ఎన్సీపీ అజిత్ పవర్ వర్గానికి రెండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18, టీడీపీకి 7, లెఫ్ట్ ఫ్రంట్ కి ఎనిమిది, టిఆర్ఎస్కు ఎనిమిది, ఇతరులకు 30 సీట్లు వచ్చే అవకాశం ఉంది.