
KL Rahul Stunning Catch: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా న్యూఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నిగ్స్ లో 263 పరుగులకు ఆల్ ఔట్ అయింది. షమీ 4, అశ్విన్, జడేజా తలా మూడు వికెట్లు తీశారు. ముఖ్యంగా తొలి టెస్ట్ తో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పట్టుదల కనబరిచారు. ఖవాజా,హ్యాండ్స్ కాబ్ మంచి స్కోరు సాధించారు. ముఖ్యంగా పేసర్ షమీ నిప్పులు చెరిగేలా బంతులు వేశాడు. ఆస్ట్రేలియా టీం లో ప్రమాదకరమైన బ్యాటర్ ట్రావీస్ హెడ్ వికెట్ తీసిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
జడేజా వేసిన బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్స్ వైపు దూసుకెళ్లింది.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ చాలా చురుగ్గా స్పందించాడు.. వెంటనే ఒక్క చేత్తో బంతిని ఒడుపుగా పట్టేశాడు. హెడ్ ఔట్ అయిన విధానం ఆస్ట్రేలియా టీం లో ఆందోళన కలిగించగా.. భారత బృందం, అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తించింది. రాహుల్ భయ్యా నువ్వు స్పైడర్ మాన్ వే.. భలే గా క్యాచ్ పట్టావు అంటూ మెచ్చుకుంటున్నారు. స్లిప్ లో క్యాచ్ లు పట్టడం అంత సులభం కాదు.. బంతి చాలా వేగంగా వస్తుంది.. దాని అంచనా వేస్తూ వెంటనే స్పందించాల్సి ఉంటుంది. లేదంటే క్యాచ్ నేల పాలు కావడం ఖాయం.

బంతి వస్తున్న వేగాన్ని అంచనా వేసి రాహుల్ తన శరీరాన్ని విల్లులా వంచాడు. కుడి చేతితో గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బ్యాటింగ్ లో పేలవ మైన ఫామ్ కనబరుస్తున్న రాహుల్ ను రెండో టెస్ట్ లో ఆడించడం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్ ను ఈ మ్యాచ్ లోనూ పక్కన పెట్టడం అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు. దీనికి తోడు అయ్యర్ ను కూడా ప్లే ఎలెవన్ లోకి తీసుకోవడంతో సూర్య అభిమానులు మండి పడుతున్నారు. తొలి టెస్ట్ లో ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన సూర్య విఫలం కావడంతో అతడిని మేనేజ్ మెంట్ పక్కన పెట్టింది. ఒక్క ఇన్నింగ్స్ లో మాత్రమే అవకాశం ఇచ్చిన మేనేజ్ మెంట్ అతడిని పక్కన పెట్టడం అభిమానులకు రుచించడం లేదు.
ICYMI – WHAT. A. CATCH 😯😯
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
— BCCI (@BCCI) February 17, 2023