
Megastar Chiranjeevi- Ponnambalam: మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలు చెయ్యడం లో కోట్లాది మందికి ఎంతో ఆదర్శం అని చెప్పడం లో ఎలాంటి అతి సయోక్తిలేదు,ఆపదలో వారికి నేను ఉన్నాను అంటూ అభయ హస్తం ఇచ్చే గొప్ప మానవతా స్ఫూర్తి నేటి తరం హీరోలు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. బ్లడ్ బ్యాంక్ ,ఐ బ్యాంక్ ని స్థాపించి ఎన్నో లక్షల మందికి సేవ కార్యక్రమాలు అందించిన చిరంజీవి, కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బ్యాంక్స్ ని ఏర్పాటు చేసి , ఉచితంగా ఎంతోమందికి ఆక్సిజన్ సీలిండెర్స్ ని సరఫరా చేసాడు.
ఇక తన తో పని చేసిన నటీనటులకు ఏదైనా ఆపద వస్తే క్షణం ఆలోచించకుండా ఎంత ఖర్చు అయినా కూడా భరించగల గొప్ప మనసు మనిషి ఆయన. ఆయన చేసిన గొప్ప పనులు ఎప్పుడూ బయటకి చెప్పుకోడు, సహాయం పొందివాళ్ళు ఎదో ఒక రోజు ఎదో ఒక సందర్భం లో చెప్తారు.

అలా రీసెంట్ గా ప్రముఖ తమిళ నటుడు పొన్నాంబళం ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చేసిన గొప్ప సహాయం గురించి చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘ఒకానొక దశలో నేను చనిపొయ్యే పరిస్థితి ఏర్పడింది.ఆ స్థితిలో మెరుగైన వైద్యం చేయించుకునేందుకు నా దగ్గర డబ్బులు లేవు.ఎవరిని అడగాలో అర్థం కాక వెంటనే చిరంజీవి గారికి ఫోన్ చేసి నా పరిస్థితి మొత్తం వివరించాను. కచ్చితంగా సహాయం చేస్తాను అని మాట ఇచ్చారు, ఎదో ఒక లక్ష, రెండు లక్షలు సహాయం చేస్తాడేమో అనుకున్నాను. కానీ సమీపం లో ఉన్న అపోలో హాస్పిటల్ లో చేరమన్నాడు. నా వైద్యానికి మొత్తం 40 లక్షల రూపాయిలు ఖర్చు అయ్యింది. మొత్తం ఆయనే కట్టేసాడు’ అంటూ పొన్నాంబళం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ లక్ష రూపాయిలు సహాయం చెయ్యడానికి ఎంతో ఆలోచించే హీరోలు ఉన్న ఈరోజుల్లో ఏకంగా 40 లక్షలు సహాయం చెయ్యడం అంటే, చిరంజీవి గొప్ప మనసుకి ఎన్ని వందనాలు చేసిన తక్కువ అవుతుంది.