Megastar Chiranjeevi Father: పేరుకే మెగాస్టార్..కానీ చిరంజీవి మాట్లాడే మాటలు..నడుచుకునే తీరు మొత్తం మిడిల్ క్లాస్ కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటుంది..ఆయన నటన కూడా అంత సహజంగా ఉండడానికి కారణం చిన్నప్పటి నుండి ఆయనకీ అలవాటు గా మారిన మధ్య తరగతి కుటుంబ స్వభావమే..ఆ స్వభావమే ఆయనని కోట్లాది మంది అభిమానులకు దగ్గరయ్యేలా చేసింది..చిరస్థాయిగా తరిగిపోని పీక్ స్థానాన్ని కట్టబెట్టింది..కేవలం చిరంజీవి మాత్రమే కాదు..తన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ , నాగబాబు కూడా మధ్యతరగతి వాళ్లకి దగ్గరగా ఉంటారు.
ఇదంతా వాళ్ళ తండ్రి నేర్పించిన క్రమశిక్షణ వల్లే వచ్చింది అని చెప్పొచ్చు..కొణిదెల వెంకట్రావు ఒక హెడ్ కానిస్టేబుల్ గా తన జీవితాన్ని ప్రారంభించారు..పెళ్లి చేసుకున్న తర్వాత 5 మంది పిల్లలని పోషించడం అంటే ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తికి మామూలు విషయం కాదు..చిరంజీవి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అవకాశాలు సాధించి, డబ్బులు సంపాదించే వరకు వెంకట్రావు సంపాదన మీదనే ఇల్లు గడిచేది.
ఇక ఆ తర్వాత చిరంజీవి స్టార్ హీరో గా ఎదిగి కోట్ల రూపాయిలు సంపాదించే రేంజ్ కి రావడం చూసి ఎంతో సంతోషించాడు వెంకట్రావు..అయితే ఆయన డిసెంబర్ 24 వ తేదీ , 2007 వ సంవత్సరం లో కన్నుమూశాడు..అప్పటి నుండి చిరంజీవి ప్రతి సంవత్సరం తన తండ్రి మరణించిన రోజు ని గుర్తు చేసుకొని మర్చిపోకుండా సంవత్సరికం చేస్తూ వచ్చాడు..ఈ ఏడాది కూడా ఆయన తన తండ్రి సంవత్సరికం ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘మాకు జన్మనిచ్చి..క్రమశిక్షణ గా పెంచి , మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ’ అంటూ చిరంజీవి తన తండ్రి గారితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి ఒక ట్వీట్ వేసాడు.
మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల
అవగాహన పంచి,
మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన
మా తండ్రి వెంకట్రావు గారిని
ఆయన సంవత్సరీకం సందర్బంగా
స్మరించుకుంటూ .. pic.twitter.com/epHicHCxbc— Chiranjeevi Konidela (@KChiruTweets) December 24, 2022