Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడి, గత కొన్ని రోజులుగా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన క్యారంటైన్లో ఉంటూ వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు. మొత్తానికి చిరు ఖాళీగా ఉన్నారు కాబట్టి.. చిరంజీవి తాజాగా తన ఫోటోగ్రఫీ నైపుణ్యానికి పదును పెట్టి, తనలోని క్రియేటివిటీని టచ్ చేశారు. ఇందులో భాగంగా అప్పుడప్పుడే ఉదయించబోతున్న సూర్యుడిని తన కెమెరాలో బంధించి ఆ అందమైన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు.
పైగా చిరు ఆ ఫోటోను పంచుకుంటూ సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన కవిత కూడా అల్లి.. ఆ కవితను కూడా పోస్ట్ చేశారు. ఇంతకీ చిరు అల్లిన కవిత ఏమిటంటే.. ‘ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో వున్నశుక్ర గ్రహం (మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా ఉంది’ అంటూ మెగాస్టార్ ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు మెగాస్టార్.
Also Read: పుష్ప డైలాగ్ః తగ్గేదే లే అంటున్న ఖలీ
మొత్తమ్మీద మెగాస్టార్ లో కూడా మంచి కవి ఉన్నాడని.. ఈ కవితతో రుజువు అయిందని నెటిజన్లు ఈ పోస్ట్ కి సమాధానంగా మెసేజ్ లు చేస్తున్నారు. మరి మెగాస్టార్ లాంటి స్టార్ హీరో ఒక వీడియో స్వయంగా షూట్ చేసి.. పైగా ఆ వీడియోకి ఒక కవిత అల్లి.. దాన్ని ఫ్యాన్స్ కోసం ఇన్ స్టాలో షేర్ చేస్తే.. ఆ మాత్రం వైరల్ కాకపోతే ఎలా ?
అందుకే, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నెటిజన్లు ‘ సూపర్ సార్.. అద్భుతంగా క్యాప్చర్ చేశారు’, ‘ మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ప్రభాస్ పై పునీత్ రాజ్ కుమార్ ఎఫెక్ట్ !