Ram Charan: నేటి తరం స్టార్ హీరోలలో వైవిద్యభరితమైన పాత్రలకు పెట్టింది పేరు లాగ మారిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లో కానీ , ట్రాక్ రికార్డ్స్ లో కానీ రామ్ చరణ్ నేటి తరం హీరోలతో పోలిస్తే అందరికంటే ముందే ఉంటాడు..చేసింది తక్కువ సినిమాలే కానీ రికార్డ్స్ లో మాత్రం తక్కువ కాదు..13 సినిమాలు చేస్తే వాటిల్లో మూడు ఇండస్ట్రీ హిట్స్, నాలుగు సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డు ని నెలకొల్పాడు రామ్ చరణ్.

ఆయన కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా , ఎన్ని రికార్డ్స్ నెలకొల్పినా రంగస్థలం చిత్రాన్ని మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు..చిట్టి బాబు పాత్రలో ఆయన అంత అద్భుతంగా నటించాడు..కచ్చితంగా ఆయనకి నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నారు కానీ తృటిలో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది.
రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్రలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్, ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న సినిమాలో నత్తి పాత్ర ని చేస్తున్నాడు..ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు..పెద్ద రామ్ చరణ్ పాత్రకి నత్తి ఉంటుందట..ఈ పాత్రే సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని సమాచారం..ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చి బాబు తో చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు..ఈ సినిమాలో రామ్ చరణ్ గుడ్డివాడిగా నటించబోతున్నాడట.

శ్రీకాకుళం లోని ఒక చిన్న పల్లెటూరు లో జరిగే రివెంజ్ డ్రామా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట..కానీ #RRR వంటి సినిమా తర్వాత ఇలాంటి ప్రయోగాలు చెయ్యడం అవసరమా..రామ్ చరణ్ ఇమేజి ఇప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది..మరి బుచ్చి బాబు రామ్ చరణ్ తో ఇలా గుడ్డివాడి పాత్ర వేయించి రంగస్థలం లాగానే గ్రాండ్ సక్సెస్ కొడతాడా లేదా అనేది చూడాలి.