Pawan Kalyan Unstoppable: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది అభిమానులు ఇప్పుడు ఎంతో ఆత్రుతతో ఆహా మీడియా ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే..ఈ ఎపిసోడ్ రేపు రాత్రి 9 గంటలకు ఆహా మీడియా లో అప్లోడ్ కాబోతుంది..అయితే పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎపిసోడ్ కాబట్టి, అప్లోడ్ చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో లక్షల మంది యాప్ ని ఓపెన్ చేస్తారు.

అలాంటి పరిస్థితిలో యాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది..ఎందుకంటే గతం లో కూడా ప్రభాస్ ఎపిసోడ్ కి ఇలాగే జరిగింది..అప్లోడ్ చేసిన వెంటనే లక్షల మంది యాప్ లోకి రావడం వల్ల సర్వర్ క్రాష్ అయ్యింది..దాంతో చాలాసేపటి వరకు ఈ ఎపిసోడ్ ని అభిమానులు మరియు ప్రేక్షకులు చూడలేకపోయారు..మళ్ళీ లైవ్ అయ్యేలోపు టెలిగ్రామ్ లో వచ్చేసింది.
దాంతో అధికశాతం అందరూ టెలిగ్రామ్ లోనే ప్రభాస్ ఎపిసోడ్ ని చూడడం వల్ల, ఆహా యాప్ కి భారీ నష్టం వచ్చింది..దీంతో ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఆహా మీడియా టీం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది..ఈ ఎపిసోడ్ కి ఆహా మీడియా టీం అంచనా ప్రకారం, అప్లోడ్ చేసిన గంటలోనే రెండు లక్షలకు పైగా వ్యూస్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఈ విషయాన్నీ స్వయంగా ఆహా యాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పుకొచ్చాడు..అంతే కాకుండా మూడు గంటల్లో వ్యూస్ మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉండడం తో మరో మూడు బ్యాకప్ సర్వర్లను కూడా రెడీ గా పెట్టుకున్నారట..మరి ఆహా మీడియా మ్యానేజ్మెంట్ అంచనాలను రేపటి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.