సీతాకోక చిలుక పెయింటింగ్ ఇంట్లో ఉంటే ఏం అవుతుందో తెలుసా?

మనం షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లకు వెళ్లిన సమయంలో అక్కడ కనిపించే పెయింటింగ్ లు, బొమ్మలు మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. మరీ ఎక్కువగా నచ్చితే వాటిని వెంటనే కొనుగోలు చేసి హాల్ లో ఉంచుతాం. ఎవరైనా మన ఇంటికి వచ్చిన సమయంలో కూడా వాటిని చూస్తే ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే బొమ్మలు, పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా..? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. […]

Written By: Kusuma Aggunna, Updated On : August 22, 2020 2:13 pm
Follow us on

మనం షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లకు వెళ్లిన సమయంలో అక్కడ కనిపించే పెయింటింగ్ లు, బొమ్మలు మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. మరీ ఎక్కువగా నచ్చితే వాటిని వెంటనే కొనుగోలు చేసి హాల్ లో ఉంచుతాం. ఎవరైనా మన ఇంటికి వచ్చిన సమయంలో కూడా వాటిని చూస్తే ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే బొమ్మలు, పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా..? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.

Also Read : కేక్‌‌పై క్యాండిళ్లు పెట్టి ఊద‌కూడ‌దు… ఎందుకంటే…?

సీతాకోకచిలుకల బొమ్మలు, పెయింటింగ్స్ మన ఇళ్లల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంట్లో సీతాకోక చిలుకల పెయిటింగ్స్ కానీ బొమ్మలు కానీ ఉంటే చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. వేర్వేరు రంగుల్లో ఉండే సీతాకోకచిలుకలు మార్పునకు సంకేతాలు అని చెబుతున్నారు. వేర్వేరు రంగుల సీతాకోక చిలుకలను చూసిన సమయంలో లక్ష్యాన్ని సాధించిన భావన కలుగుతుందని చెబుతున్నారు

అందువల్లే చాలామంది సీతాకోక చిలుకల పెయింటింగ్స్ ఎక్కువ వెల పడినా కొనుగోలు చేస్తారని చెబుతూ ఉంటారు. ఈస్ట్ లేదా నార్త్ ఈస్ట్ ప్రదేశంలో సీతాకోక చిలుకల పెయింటింగ్స్ పెడితే మంచిదని సూచిస్తున్నారు. ఈశాన్యం మూలలో సీతాకోకచిలుకలను పెట్టడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని పొందగలుగుతామని…. ఈ విధంగా పెడితే వాస్తు ప్రకారం కూడా మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జిని సులభంగా పోగొడతాయని… పెయింటింగ్స్, బొమ్మల వల్ల మంచే తప్ప చెడు జరగదని చెబుతున్నారు.

Also Read : భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?