https://oktelugu.com/

కేక్‌‌పై క్యాండిళ్లు పెట్టి ఊద‌కూడ‌దు… ఎందుకంటే…?

మనలో ప్రతి ఒక్కరికీ పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుకోవాలనే కోరిక ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలకు ప్రాధాన్యతనిస్తున్నారు. స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకునే పుట్టినరోజు వేడుకలో కేక్ మాత్రం కంపల్సరీ. అయితే పుట్టినరోజు వేడుక, ఇతర వేడుకల్లో ఎవరైనా కేక్ పై క్యాండిళ్లు పెట్టి కేక్ కట్ చేస్తూ ఉంటారు. అయితే కేక్ పై క్యాండిళ్లు పెట్టి ఊదడం మంచిది కాదని అది చాలా ప్రమాదకరం అని నిపుణులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 22, 2020 1:22 pm
    Follow us on

    మనలో ప్రతి ఒక్కరికీ పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుకోవాలనే కోరిక ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలకు ప్రాధాన్యతనిస్తున్నారు. స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకునే పుట్టినరోజు వేడుకలో కేక్ మాత్రం కంపల్సరీ. అయితే పుట్టినరోజు వేడుక, ఇతర వేడుకల్లో ఎవరైనా కేక్ పై క్యాండిళ్లు పెట్టి కేక్ కట్ చేస్తూ ఉంటారు. అయితే కేక్ పై క్యాండిళ్లు పెట్టి ఊదడం మంచిది కాదని అది చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.

    Also Read : వామ్మో.. సింహాల మలానికి ఇంత డిమాండా?

    కేకులపై కొవ్వొత్తులు పెట్టి ఊదడం శ్రేయస్కరం కాదని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల మన నోటిపై ఉండే లాలాజలం కేక్ పై పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన లాలాజలంలో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కేక్ పై పడిన వెంటనే కేక్ అంతటా వ్యాపిస్తుంది. కేక్ పై క్యాండిళ్లను ఊదిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి ప్రమాదం లేదని ఆ వ్యక్తికి రోగాలు ఉంటే మాత్రం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

    క్యాండిల్ ఊదిన వ్యక్తికి దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటే మాత్రం కేక్ తిన్న వారందరికీ ప్రమాదమే. అందువల్ల క్యాండిళ్లను ఊదే సాంప్రదాయాన్ని విడిచిపెడితే చాలా మంచిది. దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చాలా రోజుల క్రితమే పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. నోటి నుంచి కేక్ పై పడిన బాక్టీరియా పావుగంట సమయంలో 15 వేల శాతం ఎక్కువ‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Also Read : భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?