https://oktelugu.com/

Maximo Napa Castro: తాబేళ్లు, పిట్టలు, బొద్దింకలు తింటూ సముద్రంలో 14 నెలల నరకం

Maximo Napa Castro నదిలో కొట్టుకుపోయినా.. సముద్రం(See)లో కొట్టుకుపోయినా.. ఈత రాకపోతే బతకడం కష్టం. అయితే కొన్నిసార్లు ఈత వచ్చినా బతకలేము. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి ప్రమాదవ శాత్తు సముద్రంలో కొట్టుకుపోయాడు. చివరకు ఓ తీరానికి చేరాడు. 95 రోజుల అక్కడే దుర్భర జీవనం సాగించాడు.

Written By: , Updated On : March 18, 2025 / 04:59 PM IST
Maximo Napa Castro

Maximo Napa Castro

Follow us on

Maximo Napa Castro: పసిఫిక్‌ మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఈ జాలరి(Fishermen), 95 రోజుల తర్వాత ఒక గస్తీ నౌకకు కనిపించాడు. ఈ సమయంలో తాను తాబేళ్లు, పిట్టలు, బొద్దింకలు తిని బతికానని ఆయన చెప్పాడు. ఈ వ్యక్తి పేరు మాక్సిమో నాపా కాస్ట్రో(Maximo napa castro), వయసు 61 సంవత్సరాలు. అతను పెరూలోని దక్షిణ తీరంలోని మార్కోనా అనే పట్టణం నుంచి డిసెంబర్‌ 7న చేపల వేటకు బయలుదేరాడు. పది రోజుల తర్వాత ఒక తుపాను కారణంగా అతని పడవ దారి తప్పి సముద్రంలో కొట్టుకుపోయింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి సరుకులతోనే అతను రోజులు గడపాల్సి వచ్చింది. కాస్ట్రో తప్పిపోయినట్లు తెలిసిన వెంటనే అతని కుటుంబం వెతుకులాట మొదలుపెట్టింది. పెరూ సముద్ర గస్తీ దళాల సాయం తీసుకున్నప్పటికీ, అతన్ని కనుగొనలేకపోయారు. చివరకు గత బుధవారం(మార్చి 12న), తీరం నుంచి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో అతని పడవను ఈక్వెడార్‌ గస్తీ నౌక ‘డాన్‌ ఎఫ్‌‘ గుర్తించింది. అప్పటికి కాస్ట్రో తీవ్రంగా నీరసించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

Also Read: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శార్దూల్ ఠాకూర్‌

వర్షపు నీటిని(Rain water) సేకరించి తాగానని, దొరికిన వాటిని తిని బతికానని కాస్ట్రో చెప్పాడు. శుక్రవారం ఈక్వెడార్‌(Eqedar) సరిహద్దు దగ్గరలోని పైటా పట్టణంలో తన సోదరుడిని కలిశాడు. సముద్ర తాబేళ్లు, బొద్దింకలు, పక్షులను తిని బతికానని, గస్తీ దళానికి కనిపించడానికి 15 రోజుల ముందు నుంచి ఏమీ తినలేదని వివరించాడు.
తన కుటుంబం, ముఖ్యంగా తల్లి మరియు రెండు నెలల మనవరాలి గురించి ఆలోచిస్తూ ధైర్యంగా ఉన్నానని వెల్లడించాడు. అదే తనకు బతకడానికి శక్తినిచ్చిందని కాస్ట్రో అన్నాడు. ‘రోజూ అమ్మ గురించి ఆలోచించేవాడిని. బతకడానికి రెండో అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు‘ అని భావోద్వేగంతో చెప్పాడు.

ఆశలు వదులుకుని..
కాస్ట్రో తల్లి మాట్లాడుతూ, తన కొడుకు తప్పిపోయినప్పుడు ఆశలు వదిలేసినా, కుటుంబంలో మిగతా వారు అతను తిరిగి వస్తాడని నమ్మారని చెప్పింది. కాస్ట్రోను వైద్య పరీక్షల కోసం పైటాకు తీసుకెళ్లి, అక్కడి నుంచి రాజధాని లిమాకు తరలించారు. లిమా విమానాశ్రయంలో అతను తన కూతురు ఇనెస్‌ నాపాను కలిశాడు.
కాస్ట్రో సొంతూరు ఇకా ప్రాంతంలోని శాన్‌ ఆండ్రెస్‌లో అతన్ని స్వాగతించేందుకు వీధులను అలంకరించి, పండగ జరిపినట్లు బంధువులు, పొరుగువారు చెప్పారు. అతను సముద్రంలో తప్పిపోయిన సమయంలోనే అతని పుట్టిన రోజు వచ్చింది. ఇప్పుడు ఆ పుట్టిన రోజును ఘనంగా జరపాలని కుటుంబం నిర్ణయించింది. ‘ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఇది అతనికి పునర్జన్మ లాంటిది‘ అని కాస్ట్రో మేనకోడలు లేలా టోర్రెస్‌ నాపా అన్నారు.

గతంలో కూడా..
ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. గత ఏడాది రష్యాకు తూర్పున ఉన్న ఓఖోట్క్స్‌ సముద్రంలో మిఖాయిల్‌ పిచుగిన్‌ అనే వ్యక్తి రెండు నెలల తర్వాత కనిపించాడు. అలాగే, ఎల్‌ సాల్వడార్‌కు చెందిన జోస్‌ సాల్వడార్‌ అల్వారెంగా 2012లో మెక్సికో తీరం నుంచి బయలుదేరి, 14 నెలల తర్వాత 2014లో మార్షల్‌ దీవుల దగ్గర కనిపించాడు. అతను కూడా వర్షపు నీరు తాగి, తాబేళ్లు తిని బతికానని చెప్పాడు.