Maruti e Vitara : మారుతి సుజుకి ఇండియా(maruti suzuki india) ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది. కంపెనీ ఈరోజు ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ఈ ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేసింది. మార్చిలో కంపెనీ దీన్ని పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. భారత మార్కెట్లో ఇది రాబోయే హ్యుందాయ్ క్రెటా(Hyudai creta) ఎలక్ట్రిక్, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్(tata curv) ఈవీ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఈ కారులో స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.. గతేడాది ఆటో ఎక్స్‌పో సందర్భంగా మారుతి eVX పేరుతో భారతదేశంలో కాన్సెప్ట్‌గా కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ SUV ఇదే. కొత్త E Vitara అనేది సుజుకికి ప్రపంచవ్యాప్త మోడల్. వీటిని సుజుకి గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తారు. దాని ఉత్పత్తిలో 50 శాతం జపాన్, యూరోపియన్ మార్కెట్లకు ఎగుమతి చేయాలని ప్రణాళిక చేయబడింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ కారు ముందు భాగంలో Y- ఆకారపు LED DRL లు , వెనుక భాగంలో 3-పీస్ లైటింగ్ ఎలిమెంట్స్‌తో కనెక్ట్ చేయబడిన LED టెయిల్ లైట్లను కలిగి ఉంది. దీనికి పెద్ద ఫ్రంట్ బంపర్ ఉంది. దీనిలో ఫాగ్ లైట్లు అందించింది కంపెనీ. క్యాబిన్ లోపల, వివిధ టెర్రైన్ మోడ్‌లు, సన్‌రూఫ్, హిల్ హోల్డ్, ఆల్ వీల్ డ్రైవ్ కోసం రోటరీ డయల్ కంట్రోల్ తో కూడిన సెంటర్ కన్సోల్ ఉంది.
కొత్త సుజుకి ఇ-విటారా ఫీచర్స్
డిజైన్ పరంగా e-Vitara చుట్టూ మందపాటి క్లాడింగ్, చంకీ వీల్ ఆర్చ్‌లు, Y-ఆకారపు LED హెడ్‌ల్యాంప్‌లు, క టెయిల్‌ల్యాంప్‌లు, మందపాటి వెనుక బంపర్‌ను కలిగి ఉంది. మళ్ళీ, ఛార్జింగ్ పోర్ట్ ముందు ఎడమ ఫెండర్‌పై అమర్చబడి ఉంటుంది. వెనుక తలుపు హ్యాండిల్స్ సి-పిల్లర్‌పై ఉన్నాయి. టయోటా కూడా అదే ప్లాట్‌ఫామ్‌పై అర్బన్ క్రూయిజర్ ఈవీ పై పనిచేస్తుంది.
ఈ-విటారా కారులో డ్యూయల్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవల్ 2 ADAS సూట్‌తో కూడిన ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్ ఉంటుంది. మారుతి ఇ-విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. ఇందులో ఒకటి 49kWh, మరొకటి 61kWh ప్యాక్ అందుబాటులో ఉంటాయి. మునుపటిది 2WD కాన్ఫిగరేషన్‌లో అందించబడుతుంది. తరువాతిది 2WD, 4WD అనే రెండు డ్రైవ్‌ట్రెయిన్‌లను పొందుతుంది. ఈ కారులో పవర్ రైడ్ సీట్ల సౌకర్యాన్ని పొందవచ్చు.
మారుతి సుజుకి విటారా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వినియోగదారుల సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు(Air bags) అందించబడ్డాయి. ఇది కాకుండా, ప్రమాదంలో మోకాలికి గాయం కాకుండా ఉండటానికి కంపెనీ డ్రైవర్ సీటు కింద ఎయిర్‌బ్యాగ్‌ను కూడా అందిస్తుంది. దీనితో పాటు సేఫ్టీ కోసం ఈ కారులో లెవల్ 2 ADAS ఫీచర్లు కూడా చేర్చబడ్డాయి.