Marriage Cancel
Marriage: ఈ మధ్య అందరూ ఎక్కువగా వింటున్న పదం ప్రయత్నిస్తే ప్రధాని అవుతారేమో.. కానీ పెళ్లి (Marriage) మాత్రం ఈ జన్మకి కాదని అంటున్నారు. ఇందులో అబ్బాయిలతో (boys) పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. చాలా మంది అమ్మాయిల (Girls) ఆలోచన ధోరణి మారడం, ప్రస్తుతం మారిన జనరేషన్ (Generation) వల్ల పెళ్లిళ్లు కావడం లేదు. అసలు అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా పెళ్లిళ్లు కావడం లేదా? లేకపోతే పెళ్లికి నిరాకరిస్తున్నారా? ఒకవేళ నిరాకరిస్తే.. దీనికి గల కారణాలు ఏంటి? ఇంతకు ముందు జనరేషన్‌లో లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? పూర్తి విషయాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
గొప్ప జీవితం అనుభవించాలని..
ఈ రోజుల్లో కొందరు అబ్బాయిలు వ్యవసాయం, చేతి వృత్తులు వంటివి చేస్తున్నారు. వీరు ఆర్థికంగా సెటిల్ అయి ఉండరని కొందరు అమ్మాయిలు వీళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. నెలకు కనీసం రూ.లక్ష శాలరీతో పాటు కోట్లు ఆస్తి ఉంటేనే భవిష్యత్తులో బాగుంటుందని భావిస్తున్నారు. ఎలాంటి ఆందోళనలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుందని నమ్ముతున్నారు. ఈ కారణం వల్ల కూడా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలకి పెళ్లిళ్లు కావడం లేదు. కొందరు అబ్బాయిలు భార్యకు మంచి జీవితం ఇవ్వలేమనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో తక్కువ శాలరీ ఉన్నవారు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అలాగే అమ్మాయిలు కూడా ఆలోచిస్తున్నారు. కేవలం ఒక్కరి సంపాదన మీద జీవించడం కష్టమని భావించి కెరీర్‌లో ఎదగాలని పెళ్లికి నో చెబుతున్నారు. ఎంత అందం, చదువు ఉన్నా కూడా ఆస్తి, డబ్బులనే చాలా మంది ఎక్కువగా చూస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు కూడా..
కేవలం డబ్బు, ఆస్తి అనే కారణాలే కాకుండా.. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల వల్ల కూడా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిల భయపడుతున్నారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న వారి కంటే బాధపడిన వారే ఎక్కువగా ఉంటున్నారు. పెళ్లయిన వెంటనే కనీసం ఏడాది కూడా పూర్తి కాకుండానే చాలా మంది విడాకులు బాట పడుతున్నారు. మరికొందరు లెస్బియన్స్‌గా ఉంటున్నారు. పెళ్లయిన తర్వాత ఇలానే ఉంటారు ఏమోనని చాలా మంది పెళ్లికి నిరాకరిస్తున్నారు. వీటితో పాటు అక్రమ సంబంధాలు కూడా చాలా మంది భయపెడుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటారని కొందరు ఆలోచించి పెళ్లి వెనుకడుగు వేస్తున్నారు.
సర్దుబాటు కాలేక..
ప్రస్తుత కాలంలో యువత వారికి నచ్చినట్లుగా ఉంటున్నారు. పూర్వం రోజుల్లో ఎంతో కాస్త సర్దుకునే వారు. కానీ ప్రస్తుతం సర్దుకోకుండా ఎవరి ఇష్టం మీద జీవించాలని అనుకుంటున్నారు. ఇలాంటి కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. పెళ్లయితే ఫ్రీడమ్ ఉండదని కొందరు భావించి పెళ్లి చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇవే కాకుండా ఒకరి ఇష్టాలకు మరొకరు అసలు గౌరవించుకోవడం లేదు. ప్రతీ ఒక్కరికి లైఫ్‌లో కొన్ని గోల్స్ ఉంటాయి. వాటికి గౌరవం ఇవ్వకపోవడం వల్ల చాలా మంది పెళ్లి చేసుకోవడం లేదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.