Karnataka Love Marriage: ఇదో ముక్కోణపు ప్రేమకథ. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన ప్రేమతో ఓ కుటుంబమే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. భర్త వివాహేతర సంబంధం తెలియడంతో భార్య, భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త, ప్రియుడి చావును భరించలేక ప్రియురాలు విగతజీవులుగా మారిన ఓ వింతైన కథ. మనసులు కకావికలం అయితే ఆత్మహత్యే శరణ్యమనే భావన అందరిలో ఉంటోంది. కానీ ప్రతి విషయానికి చావే శరణ్యమనే భావన కలగడం నిజంగా విడ్డూరమే. తోడు ఉండాల్సిన వారు లేకపోతే ఇక జీవితం నరకమే అని భావించి చివరకు ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

కర్ణాటకలోని రాయచూర్ లో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాయచూర్ లోని థర్మల్ కేంద్రంలోని ఆర్టీపీఎస్ లో ఇంజినీర్ పనిచేస్తున్న పార్వతి(30) శనివారం ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న శక్తినగర్ పోలీసులు కేసు వివరాలు నమోదు చేసుకోవడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆమె రాసిన సైసైడ్ నోటు చూసి నివ్వెరపోయారు.
పార్వతి తన సహోద్యోగి ఇంజినీర్ సోమ్ నాథ్ తో ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఒకే విభాగంలో పనిచేసే వీరి మధ్య ప్రేమ చిగురించింది. విషయం కాస్త సోమ్ నాథ్ భార్య (వేద) కు తెలిసింది. దీంతో ఆమె కలత చెందింది. తన భర్త ఇలా చేస్తున్నాడనే నెపంతో పుట్టింటికి వెళ్లింది. బాగల్ కోటిలో ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read: మరోసారి చైనాను వెంటాడుతున్న కరోనా వైరస్?
భార్య బలవన్మరణంతో సోమ్ నాథ్ కూడా ఇక తాను బతకలేనని భావించాడు. జనవరి 21న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తన ప్రియుడు లేని జీవితం తనకు కూడా అవసరం లేదని తనువు చాలించింది. పార్వతి అన్న థర్మల్ కేంద్రంలో ఉద్యోగం చేస్తుండగానే చనిపోయాడు. కారుణ్య నియామకం కింద పార్వతికి ఇంజినీర్ ఉద్యోగం ఇచ్చారు. దీంతో పార్వతికి సోమ్ నాథ్ కు మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
Also Read: మీ పిల్లలకు పేర్లు పెడుతున్నారా.. అస్సలు చేయకూడని తప్పులు ఇవే!