Mucharla Aruna In Ram Movie: ఒకప్పుడు తన నటనతో ఆకట్టుకున్న సీనియర్ నటి ముచ్చర్ల అరుణ తిరిగి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలు ముచ్చర్ల అరుణ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయి.. సక్సెస్ అయింది కూడా. కాగా ఈ మాజీ హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించేందుకు సిద్ధమైన ముచ్చర్ల అరుణకు.. తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.
కాగా హీరో రామ్ తో.. బోయపాటి సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరో అమ్మ పాత్రకు ముచ్చర్ల అరుణను సంప్రదించినట్లు సమాచారం. బోయపాటి ఇప్పటికే ముచ్చర్ల అరుణకు కథ, పాత్రను వివరించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి ముచ్చర్ల అరుణ మళ్ళీ తన నటనతో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. నిజానికి గతంలో ముచ్చర్ల అరుణ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండేది కాదు.
Also Read: వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ డే కలెక్షన్స్
కానీ ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచి.. 50 ఏళ్ల ప్లస్ వయసులో కూడా రీసెంట్ గా అదిరిపోయే వంటలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోంది ముచ్చర్ల అరుణ. ఈ వీడియోలు బాగా వైరల్గా అయ్యాయి కూడా. ఒకప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపించిన ముచ్చర్ల అరుణ ఇప్పుడు అమ్మ పాత్రల్లో అభిమానులను కూడా షాక్ చేస్తోందట.
అయితే, ముచ్చర్ల అరుణ లేటు వయసులో యాక్టివ్ కావడానికి ప్రధాన కారణం.. మూవీల్లో అవకాశాల కోసమే. ఛాన్స్ ల కోసమే.. ప్రస్తుతం మకల్ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. అలాగే తాజాగా బోయపాటి సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.
Also Read: ‘భీమ్లా నాయక్’ లేటెస్ట్ కలెక్షన్స్.. పవన్ రేంజ్ ఏమిటో తెలిసింది
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More