
Manchu Manoj Wedding- Vishnu: మంచు మనోజ్ గత కొంతకాలం నుండి భూమా మౌనిక తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే..వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కొంతకాలం నుండి వస్తున్నప్పటికీఎం, సోషల్ మీడియా లో ఈమధ్య ఇలాంటి ఫేక్ వార్తలు బాగా వస్తున్నాయి కదా,ఇది కూడా ఫేక్ న్యూస్ అయ్యుంటుంది ఏమో అని అనుకున్నారు.కానీ గత కొంతకాలం నుండి వీళ్లిద్దరు కలిసి పూజలు చేయించడం, ఎక్కడకి వెళ్లిన జంటగా కలిసి వెళ్లడం లాంటివి చూసాక వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అనే వార్తలు నిజమే అని తేలింది.
మంచు మనోజ్ కూడా ఈమధ్యనే అధికారికంగా పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు.అయితే ఈ పెళ్లి ఒక్క లక్ష్మి ప్రసన్న కి తప్ప, ఇంట్లో ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు.మోహన్ బాబు మరియు విష్ణు చాలా తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు, అసలు పెళ్ళికి వస్తారో రారో అని అందరూ అనుకున్నారు.
కానీ మంచు విష్ణు తన పెళ్ళాం పిల్లలతో కలిసి వచ్చాడు.ఎదో ఇంట్లో వాడిలాగా కాకుండా కేవలం ఒక మామూలు అతిథిగా మాత్రమే వచ్చి, ఒక 20 నిమిషాల పాటు పెళ్ళిలో ఉంది వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.ఇదంతా అక్కడకి వచ్చినోళ్లందరూ చూసి షాక్ కి గురయ్యారు.సొంత అన్నయ్య పెళ్ళికి విష్ణు కేవలం అతిథి లాగ రావడం ఏమిటి?, వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నాకాని ఇలాంటి సమయాల్లో కూడా కలిసి ఉండకపోతే ఇక ఎందుకు అంటూ అక్కడకి వచ్చినవాళ్లు గుసగుసలాడారట.

మరో పక్క మంచు లక్ష్మి మాత్రం తన అన్నయ్య పెళ్లిని తన ఇంట్లోనే పెట్టుకుంది.కేవలం కొంతమంది బంధుమిత్రుల సమక్ష్యం లో ఈ పెళ్లిని చాలా సింపుల్ గా చేసారు.ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.మంచు కుటుంబం లో మొదటి నుండి మంచు మనోజ్ అంటే నెటిజెన్స్ కి బాగా ఇష్టమే.అందుకే ఆయన పెళ్ళికి అందరూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసారు.