
Manchu Lakshmi- Manoj Wedding: మంచు కుటుంబం మీద సోషల్ మీడియా లో తరుచూ ట్రోల్ల్స్ వస్తూనే ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే.ఎందుకంటే ఈ ఫ్యామిలీ లో డబ్బా రాయుళ్లు ఎక్కువ కాబట్టి, వాళ్ళు మాట్లాడే మాటలు చూసే వాళ్లకి చాలా కామెడీ గా అనిపిస్తాయి కాబట్టి.కానీ ఈ కుటుంబం లో అందరూ ఎంతో ఇష్టపడేది మంచు మనోజ్ ని.ఇతని పద్దతి, నడవడిక మోహన్ బాబు మరియు విష్ణు కి పూర్తిగా బిన్నం.
ఎక్కువగా డప్పు కొట్టుకోడు, ఉన్నది ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడుతాడు, సమాజం కి ఎదో ఒకటి చెయ్యాలనే మంచి మనసు ఉన్న అతని తత్వాన్ని అందరూ ఎంతో మెచ్చుకుంటారు.ముఖ్యంగా ఈయన ప్రసంగాలు ఎంతో బాగుంటాయి, కుర్రాళ్లల్లో చైతన్యం కలిగించే విధంగా ఉంటాయి.అందుకే మంచు మనోజ్ విషయం లో ఏ చిన్న పాజిటివ్ విషయం జరిగినా అందరూ ఆయనకీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు.నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది.
ఈ పెళ్లి పనులన్నీ మంచు లక్ష్మినే దగ్గరుండి చూసుకుంది.కానీ మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు మాత్రం ఈ పెళ్లిని అంతగా పట్టించుకోలేదు,మంచు విష్ణు ఎదో నలుగురిలో ఒకడిగా వచ్చి అక్షింతలు వేసి పది నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయాడని టాక్.ఇంట్లో మొదటి నుండి మనోజ్ రెండవ పెళ్లి భూమా మౌనిక తో ఒప్పుకునేవారు కాదట.ఒక్క మంచు లక్ష్మి ప్రసన్న ఒక్కటే వీళ్లిద్దరికీ మద్దతుగా నిల్చింది..ఇంట్లో మోహన్ బాబు మరియు విష్ణులతో గొడవపడి మీరు చెయ్యకపోతే నేను చెయ్యలేనా అని తన ఇంట్లోనే పెళ్లి పట్టుబట్టి చేసినట్టు తెలుస్తుంది.

పలు ఇంటర్వ్యూస్ లో ఆమె ఇదివరకే మనోజ్ మీద తనకి ఉన్న ఇష్టాన్ని చెప్పుకొచ్చింది.’మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయిన, మనోజ్ నాకు కొడుకు తో సమానం..వాడికోసం ఏమైనా చేస్తాను’ అని ఎన్నో సందర్భాలలో తెలిపింది.అలా మనోజ్ కోసం ఇంట్లో అందరితో పోరాడి ఈరోజు అతని సంతోషం కోసం రెండవ పెళ్లి తన చేతులమీదుగా చేయించడం పై సర్వత్రా మంచు లక్ష్మి పై ప్రశంసల వర్షం వర్షం కురుస్తుంది.