https://oktelugu.com/

Mohan Babu Home Tour: మోహన్ బాబుకు రాజభవనాన్ని తలపించే ఇల్లు.. మంచు లక్ష్మీ వీడియో వైరల్!

Mohan Babu Home Tour: మంచు మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా బిజినెస్‌మెన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు సినిమాల్లో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇటీవలే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కూతురు లక్ష్మీ మంచు గృహిణిగానే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా పాత్రలు పోషిస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటారు. మోహన్ బాబుకు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 31, 2021 / 12:14 PM IST
    Follow us on

    Mohan Babu Home Tour: మంచు మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా బిజినెస్‌మెన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు సినిమాల్లో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇటీవలే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కూతురు లక్ష్మీ మంచు గృహిణిగానే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా పాత్రలు పోషిస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటారు. మోహన్ బాబుకు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్ పై చాలా సినిమాలు తెరకెక్కించారు. అయితే, అందులో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వాటిల్లాయి.

    Mohan Babu Home Tour

    అయితే, మోహన్ బాబుకు తెలుగురాష్ట్రాల్లో విద్యాసంస్థలు ఉన్నాయి. అవి ఆయన్ను నష్టాల బారినుంచి కాపాడుతున్నాయని టాక్. మంచు విష్ణు విద్యాస్థంస్థలకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఎందరో విద్యార్థులు ఈ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. తిరుపతిలో విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ను భారీ స్థాయిలో విస్తరించారు.

    Also Read: మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?
    ఇది రెండు రాష్ట్రాల్లో అతి పెద్ద విద్యా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచినది. వీటి ద్వారా మంచు కుటుంబానికి భారీగానే ఆదాయం వస్తుంటుంది. ఈ డబ్బుతో ఆయన చాలా ఏళ్ల కిందట శంషాబాద్‌లో కొన్ని ఎకరాల స్థలం కొన్నారు. అందులో ఒక రాజప్రసాదం లాంటి ఇల్లు కట్టారు. ఇంటి చుట్టూ ఉద్యానవనం ఏర్పాటు చేశారు. అది ఇంటి కంటే చాలా పెద్దది. దాని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు.

    ఈ ఇంటి గురించిన విశేషాలను మంచు లక్ష్మీ తన యూట్యూబ్ చానల్‌లో పంచుకున్నారు. కొన్ని రోజుల కిందట తన తండ్రి ఇంటి గురించి హోమ్ టూర్ ప్రోమో విడుదల చేశారు. ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మొత్తంగా ఇంటితో పాటు ఉద్యానవనంలోని అన్ని విశేషాలను ఆమె ఈ వీడియోలో పంచుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం 3 ఫోర్లు ఉన్న ఇంటిలోపల ఒక్కో గదిని చూస్తే కళ్లు చెదురుతాయి. ఇంట్లో పెద్ద హోం థియేటర్21తో పాటు మేడ మీద స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్, భారీ డైనింగ్ రూం, ఆఫీస్ రూమ్స్, లివింగ్ రూమ్స్.. ఇలా అన్నీ చూస్తే మోహన్ బాబు ఇంటి వైభవం చూసి సెలబ్రెటీలకు కళ్లు కుట్టక మానదు.

    Also Read: పేరుకు రికార్డు కలెక్షన్స్.. లాభాల లెక్కల్లో సోదిలో కూడా లేరు!

    Tags