‘మంచిరోజులు వచ్చాయి’ నుంచి ‘సోసో’ పాట వైరల్

చిన్న సినిమాల దర్శకుడు మారుతి మరో చిన్న సినిమాతో మన ముందుకు వచ్చాడు. కేవలం రెండు నెలల్లో ఈ చిత్రాన్ని తీసినట్టు చెబుతున్నారు. యూవీ కాన్సెప్ట్, మారుతి సొంత బ్యానర్ మాస్ మూవీ మేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మారుతి దర్శకత్వం వహించారు. చిన్న సినిమాలను మంచి కథా వస్తువుతో రెండు మూడు నెలల్లోనే తీసి హిట్ కొట్టించగల నేర్పు దర్శకుడు మారుతి సొంతం. తాజాగా అలాంటి ప్రయత్నమే చేశాడు. ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమాను […]

Written By: NARESH, Updated On : August 16, 2021 3:58 pm
Follow us on

చిన్న సినిమాల దర్శకుడు మారుతి మరో చిన్న సినిమాతో మన ముందుకు వచ్చాడు. కేవలం రెండు నెలల్లో ఈ చిత్రాన్ని తీసినట్టు చెబుతున్నారు. యూవీ కాన్సెప్ట్, మారుతి సొంత బ్యానర్ మాస్ మూవీ మేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మారుతి దర్శకత్వం వహించారు.

చిన్న సినిమాలను మంచి కథా వస్తువుతో రెండు మూడు నెలల్లోనే తీసి హిట్ కొట్టించగల నేర్పు దర్శకుడు మారుతి సొంతం. తాజాగా అలాంటి ప్రయత్నమే చేశాడు. ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమాను కొత్త యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహరీన్ లపై తీశాడు.

తాజాగా ఈ సినిమాలోంచి ఒక అందమైన పాట విడుదలైంది. ‘సోసోగా ఉన్నవాణ్ణి.. సో బెటరే చేసావులే’ అంటూ సాగిన ఈ పాటను కేకే రాశాడు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.

ఈ పాటను సిద్ధూ శ్రీరామ్ తన శ్రావ్యమైన గొంతుతో పాడడంతో పాట మరింత అద్భుతంగా వచ్చింది. శాస్త్రీయ సంగీతంతో రూపొందిన ఈ పాట ప్రస్తుతం అందరినీ అలరించేలా ఉంది.