Manchi Rojulu Vachayi Movie: మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. టాలీవుడ్ లో కామెడీ ,డిఫరెంట్ క్యారెక్టర్ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ మారుతికి ఎవరు సాటి లేరు అని చెప్పాలి. కొత్తజంట, ప్రేమ కథ, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయం అందుకున్నారు మారుతి. కాగా ఇప్పుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకి రచయిత అయిన మారుతి ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నాడు. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే ఫాదర్ ఎమోషనల్ కథ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక హీరోగా సంతోష్ శోభన్ ఈ కథకు మంచి ఛాయిస్ అనిపించుకున్నాడు. సెకెండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాల్లో అతని నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మెహ్రీన్ కూడా బాగానే అలరించింది. ముఖ్యంగా హీరోతో మంచి రొమాంటిక్ సీన్స్ తో రెచ్చగొట్టింది.
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ వేదికగా సందడి చేసేందుకు సైతం రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లామ్‌ఫాం ఆహా వేదికగా ‘మంచి రోజులు వచ్చాయి’డిసెంబర్ 3నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా కాగా ఎస్‌కేఎన్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటించారు. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.