థియేటర్లు తెరుచుకున్నా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలకు థియేటర్స్ లో కలెక్షన్స్ రావడం లేదనేది నిజం. అందుకే కొన్ని సినిమాలు ఇంకా ఓటీటీల వైపే చూస్తున్నాయి. మరి కొన్ని థియేటర్స్ లోనే రిలీజ్ అవడానికి ముస్తాబు అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ తో పాటు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు లిస్ట్ ఏమిటి ? వాటి పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం.
ఈ వారం రాబోయే తెలుగు సినిమాల్లో ‘కనబడుటలేదు’ ఒకటి. సునీల్ కీలక పాత్రలో వస్తోన్న ఈ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ఆగస్టు 19న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
ముగ్గురూ మధ్యవయస్కులు చిలిపి పనులు చేస్తే.. ఈ క్రమంలో ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడితే.. ఎలా ఉంటుంది ? ఇదే విషయాన్ని చూపించడానికి వస్తోంది ‘క్రేజీ అంకుల్స్’ సినిమా. ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది.
ఇక యాక్షన్ ప్రియులను అలరించడానికి వస్తోన్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఆగస్టు 19న ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ థియేటర్స్ లో విడుదల కానుంది. ‘బజార్ రౌడీ’ ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ చూస్తే..
అమెజాన్ ప్రైమ్ లో – ‘ఇవాన్ అల్మైటీ’ సినిమా ఆగస్టు 16న, అలాగే ‘ద స్కెలిటన్ ట్విన్స్’ సినిమా ఆగస్టు 17న రిలీజ్ కానున్నాయి.
ఆహా విషయానికి వస్తే – ‘తరగతి గది దాటి’ అనే సినిమా ఆగస్టు 20న రిలీజ్ కానుంది.’నైన్ పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్’ ఆగస్టు 18న, అలాగే ‘అన్నెట్టే’ ఆగస్టు 20న మరియు ‘కిల్లర్ ఎమాంగ్ అజ్’ ఆగస్టు 20న, ‘హోమ్’ ఆగస్టు 19న విడుదల కానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ లో – కామెడీ ప్రీమియం లీగ్ కామెడీ షో ఆగస్టు 20న రిలీజ్ కానుంది. ‘స్వీట్‌గర్ల్’ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.
జీ 5 లో -‘200 హల్లా హో’ ఆగస్టు 20న రిలీజ్ కానుంది.
ఆల్ట్ బాలాజీ లో -‘కార్టెల్’ ఆగస్టు 20న రిలీజ్ కానుంది.