14 Marriages: అతడో దగాకోరు. మోసకారి. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 14 మందిని పెళ్లి చేసుకున్నాడు ఒకరికి తెలియకుండా మరొకరనిని వివాహం చేసుకుంటూ నిత్యం పెళ్లికొడుకు అవతారమెత్తాడు. చివరకు బాగోతం బయటపడటంతో కటాకటాలు లె్కిస్తున్నాడు. అభా్గ్యుల జీవితాలతో ఆటలాడిన నయవంచకుడి విషయం తెలియడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని మాయమాటలు చెప్పి మధ్య వయసున్న మహిళలను టార్గెట్ చేసుకుంటూ వారిని పెళ్లి చేసుకుని కొద్ది రోజులు సంసారం చేసి ఉడాయించడం అతని చర్య. ఇలాగే ఓ సారి పెళ్లి చేసుకుని తరువాత ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై విచారణ చేపట్టగా ఈ పెళ్లిళ్ల తంతు బయటకు వచ్చింది.
ఒకసారి పెళ్లి చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్న నేటి రోజుల్లో ఏకంగా 14 పెళ్లిళ్లు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. అదీ కూడా ఏడు రాష్ట్రాల్లో మహిళలను మోసానికి గురిచేసి ప్రబుద్ధుడి నిర్వాకం చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. పేడు మూతోడు ఎప్పటికి పెళ్లికొడుకే అన్నట్లు యాభై నాలుగు ఏళ్లున్నా ఇంకా పెళ్లిళ్లు చేసుకుంటే దర్జాగా తిరగడం అతనికే చెల్లింది. ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకుంటూ అంతర్రాష్ర్టాల్లో కూడా తన ఉనికి చాటుకున్నాడు.
Also Read: సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?
ఒడిశాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్ (54) తాను ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని పరిచయాలు పెంచుకుంటాడు. అనంతరం మధ్య వయసు గల మహిళలు విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకుంటాడు. అనంతరం తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చె్ప్పి వారిని తనకు లోబరుచుకుని వివాహం చేసుకుంటాడు. అనంతరం కొంత కాలం కాపురం చేసి తనకు భువనేశ్వర్ లో పని ఉందని చె్క్కేస్తాడు. ఇలా పెళ్లిళ్లు చేసుకుంటూ వెళుతూ ఉండగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా డొంకంతా కదిలింది. అతడి బాగోతం బయటపడింది.
పంజాబ్, ఢిల్లీ, అసోం, చత్తీస్ గడ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మహిళలను వివాహం చేసుకున్నట్లు తేలింది. దీంతో వారందరు అతడిపై కేసు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఒంటరిగా జీవిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని పెళ్లి చేసుకునే వాడు. ఇలా ఏకంగా 14 మందిని పెళ్లి చేసుకోవడం అంటే మాటలు కాదు. అంటే అతడి నిర్వాకానికి అందరు బలయ్యారు. మహిళల జీవితాలతో ఆడుకున్న ఆ ప్రబుద్దుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నయవంచకుడి మోసా్న్ని అందరికి తెలియజేసి ఎవరు కూడా ఇకపై మోసపోకుండా చూడాలని కోరుతున్నారు.
Also Read: 24 గంటల్లోనే ఇద్దరిని లేపిన జగన్..డీజీపీ, సీఎంవో కార్యదర్శి బదిలీలకు అసలు కారణం అదే?