Indonesian Teacher: భావిభారత పౌరులను తయారు చేయాల్సిన ఓ పాఠశాల ప్రిన్సిపాల్ వారి జీవితాలను చిదిమేయడం దారుణం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే వారి పాలిట కీచకుడయ్యాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మందిపై లైంగిక దాడి చేసి వారిని తల్లులను చేసిన ఉదంతం ఒకటి వెలుగు చూసింది. అభం శుభం తెలియని బాలకలను లక్ష్యంగా చేసుకుని తన సరదాలు తీర్చుకున్నాడు. ఫలితంగా వారి జీవితాలు నాశనం అయ్యాయి. దీంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారి భవిష్యత్ ఏమిటన్నదే ప్రశ్నగానే మిగిలిపోతోంది. జీవితంలో ఎదగాల్సిన వారిని వంచించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.
ఇండోనోషియా దేశంలోని బాండుంగ్ నగరంలోని ఓ ఇస్లామిక్ పాఠశాలలో 2016 నుంచి 2021 మధ్య కాలంలో సదరు ప్రిన్సిపాల్ 13 మంది బాలికలను బెదిరించి వారిపై లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది. వారిలో ఎనిమిది మందికి పిల్లలు కూడా పుట్టారు. దీంతో కొంతమంది కేసులు ఎందుకని భయపడినట్లు చెబుతున్నారు. దీంతో కీచకోపాధ్యాయుడి లీలలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. బాలికలను పాఠశాలలోనే కాకుండా హోటళ్లు, అద్దె ఇళ్లు, అపార్ట్ మెంట్లలో వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిపై పలుమార్లు అత్యాచారం చేయడంతో వారు గర్భం దాల్చి పిల్లలను కనడం తెలిసిందే.
Also Read: ఇందిరాగాంధీ అంత్యక్రియలు: రాజీవ్, రాహుల్ ఫొటో వైరల్ వెనుక కథ..
దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసంఘటనపై గత నవంబర్ లోనే కేసు పెట్టినా బయటకు తెలిస్తే బాలికల జీవితాలు నాశనం అవుతాయనే ఉద్దేశంతో ఇన్ని రోజులు గుట్టుగా ఉంచినా చివరకు మాత్రం అందరికి తెలిసిపోయింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అసలు ఉరిశిక్ష వేయాలని డిమాండ్లు వచ్చినా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. బాలికల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.600 నుంచి ఆరు వేల డాలర్ల నష్టపరిహారం అందజేయాలని సూచించింది.
కంచే చేను మేస్తే ఏం చేస్తారు. విద్యార్థినులకు అండగా నిలవాల్సిన ఉపాధ్యాయుడే వారి పాలిట శాపంగా మారడం సంచలనం కలిగించింది. 13 మంది బాలికలను తన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడం ఆందోళన కలిగించింది. ఇంత దారుణమైన దురాగాతానికి పాల్పడిన ప్రిన్సిపాల్ పై విమర్శలు పెరిగాయి. అతడిని ఉరి తీయాలని పెద్ద మొత్తంలో ఆందోళనలు రేగాయి. దీంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను ఎలా పాఠశాలలకు పంపేదని భయపడుతున్నారు. సురక్షితంగా ఉండాల్సిన పాఠశాలలోనే టీచర్ ఇంతటి దురాగాతానికి పాల్పడటంపై అందరిలో ఆగ్రహం పెరిగిపోతోంది.
Also Read: పవన్ కళ్యాణ్.. అమావాస్య చంద్రుడేనా?