Bappi Lahiri: బాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి. కాగా ఈ దిగ్గజ సంగీత దర్శకుడు బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన బప్పి లహిరి.. చివరకు కన్నుమూశారని ముంబై వైద్యులు అధికారికంగా తెలియజేశారు.
సింహాసనం, గ్యాంగ్ లీడర్, స్టేట్ రౌడీ లాంటి తెలుగు సినిమాలకు బప్పి లహిరి సంగీత దర్శకత్వం వహించడం విశేషం. బప్పి లహిరి వయసు ప్రస్తుతం 69 ఏళ్లు. వెటరన్ గాయకుడు అయిన బప్పి లహిరి గత ఏడాది ఏప్రిల్ నెలలో కొవిడ్ బారిన పడి.. అప్పటి నుంచి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Also Read: ఈ రాశుల వారికి ప్రపోజ్ చేస్తే తప్పకుండా మీ లవ్ సక్సెస్ అవుతుంది..!
నిజానికి ఆయనకు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మంచానికే పరిమితమయ్యారు. బప్పి లహిరి జుహూలోని తన స్వగృహంలో వీల్ ఛైర్ సాయంతో తిరిగారు. బప్పి లహిరి మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖ నటీనటులు సంతాపం తెలిపారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ కోలుకుంటారు అని భావించాం, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటూ ఆయన సన్నిహితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున బప్పి లహిరి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: మెగాస్టార్ కెరీర్ మలుపు తిప్పిన బప్పిలహరి సాంగ్స్ ఇవే..