CCTV Camera: కూతురి తలపై సీసీటీవీ అమర్చిన వ్యక్తి.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

సీసీ కెమెరా... సాధారణంగా దీనిని ఇంటి ఆవరణలో, వ్యాపార సముదాయాల్లో.. గ్రామ, పట్టణ కూడళ్లలో ఏర్పాటు చేసుకుంటారు. సెక్యూరిటీ కోసం వీటని అమరుస్తారు. అయితే ఆ దేశంలో ఓ వ్యక్తి వెరైటీగా ఆలోచించాడు. తన కూతురు తలకే సీసీ కెమెరా అమర్చాడు.

Written By: Raj Shekar, Updated On : September 9, 2024 11:47 am

CCTV Camera

Follow us on

CCTV Camera: సీసీ కెమెరా.. ఇప్పుడు సెక్యూరిటీ సాధనం. ఒక్క సీసీ కెమెరా పది మంది పోలీసులకు సమానమని పోలీసులే చెబుతున్నారు. నేరాల నియంత్రణకు అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న నేరాలు, దొంగతనాల నేపథ్యంలో ఇప్పుడు అంతటా సీసీ కెమెరాలు అమర్చుకుంటున్నారు. ఇళ్లు, ఆఫీస్‌లు, రోడ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లో, కూడళ్లలో, వ్యాపార కేంద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా సీసీ కెమెరాలే కనిపిపిస్తున్నాయి. సీసీ కెమెరాల సాయంతో చాలా మంది నేరస్థులను పట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే సీసీ కెమెరాలు ఉన్నా నేరగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మన దాదాయి దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం కూతురు సెక్యూరిటీ కోసం భిన్నంగా ఆలోచించాడు. ఏకంగా కూతురు తలపైనే సీసీ కెమెరా భిగించాడు. ఇలా ఎందుకు చేశాడో తెలిస్తే నోరు ఎల్లబెడతారు. కరాచీకి చెందిన ఆ యువతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తలపై సీసీటీవీ కెమెరా ఎందుకు ఉందో వివరించింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎందుకు ఏర్పాటు చేశారంటే..
వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ యువతితో మాట్లాడాడు. తన తలపై సీసీ కెమెరాను తన తండ్రి ఏర్పాటు చేశారని చెప్పింది. చీచీనేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానో ప్రతి విషయం తెలుసుకోవాలని మా నాన్న అనుకున్నారు అని చెప్పింది. అందుకు మీరు అభ్యంతరం చెప్పలేదా అని అడిగితే.. ఆమె లేదని తెలిపింది. రక్షణ కోసమే మా నాన్న ఈ ఏర్పాటు చేశారు. మా నాన్న నా సెక్యూరిటీ గార్డు. ప్రస్తుతం కరాచీలో పరిస్థితులు చూస్తున్నాం కదా.. అందుకే ఇలా సీసీ కెమెరా అమర్చారు. అని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

1.4 లక్షల మంది చూశారు..
ఈ వీడియోను ఇప్పటి వరకు 1.4 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. చీచీఇది అంత సర్‌ప్రైజింగ్‌ ఏమీ కాదు.. పాకిస్తాన్‌లో పరిస్థితి ఏంటో అందరికీ తెలుసుచీచీ అని కొందరు.. చీచీౖ హె లెవెల్‌ సెక్యూరిటీ.. చీచీ, చీచీ డిజిటల్‌ పాకిస్తాన్‌చీచీ, చీచీపాకిస్తాన్‌లోనే ఇలాంటివి సాధ్యంచీచీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలాంటి ఆలోచనలు వాళ్లకే వస్తాయేమో అని పేర్కొంటున్నారు.