Salman Khan: గణేష్ వేడుకల్లో మైమరిచిపోయి డ్యాన్స్ చేసిన సల్మాన్ ఖాన్..వీడియో వైరల్…

వినాయక చవితి సందర్భంగా శనివారం రోజున వినాయకున్ని ప్రతిష్టించారు. ఇక ఆదివారం రోజున వినాయకుడికి నిమజ్జన కార్యక్రమాలను చేపట్టడానికి అర్పితా ఖాన్, తన భర్త అయిన పియుష్ శర్మ లు ఏర్పాటు చేశారు.

Written By: Gopi, Updated On : September 9, 2024 11:43 am

Salman Khan

Follow us on

Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో కండల వీరుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు సల్మాన్ ఖాన్… ఇక తన చెల్లి అయిన అర్పితా ఖాన్, భావ పీయూష్ శర్మ ల ఇంట్లో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ తో పాటు అర్బాజ్ ఖాన్ సలీం ఖాన్, అర్భజ్ కుమారుడు అర్హన్, సోహైల్ కుమారుడు నిర్వాన్, యోహన్ లు పాల్గొన్నారు. ఇక వీళ్ళ తో పాటుగా వరుణ్ శర్మ, ఓర్రి, యులియా వంతూర్ వంటి సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా శనివారం రోజున వినాయకున్ని ప్రతిష్టించారు. ఇక ఆదివారం రోజున వినాయకుడికి నిమజ్జన కార్యక్రమాలను చేపట్టడానికి అర్పితా ఖాన్, తన భర్త అయిన పియుష్ శర్మ లు ఏర్పాటు చేశారు. ఇంకా ఇందులో పాల్గొన్న సల్మాన్ ఖాన్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా డ్యాన్సులు చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి వీళ్ళు వినాయక చవితి పండుగని అలాగే నిమజ్జన కార్యక్రమం అని చాలా గొప్పగా జరుపుకుంటారు.

ఇక అందులో భాగంగానే మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట కలవడం అనేది సల్మాన్ ఖాన్ తో పాటు అర్పిత ఖాన్ కి కూడా చాలా ఆనందాన్ని కలిగించినట్టుగా కూడా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ గత కొన్ని రోజుల నుంచి ఎన్ని సినిమాలు చేసినా కూడా సక్సెస్ లు సాధించలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మురుగదాస్ డైరెక్షన్ లో సికిందర్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఇప్పుడు సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయనకు భారీ సక్సెస్ దక్కుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి సల్మాన్ ఖాన్ కి ఒక్క సక్సెస్ కూడా లేకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన చాలావరకు వెనుకబడిపోయాడు.

ఇక షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో పఠాన్, జవాన్ లాంటి రెండు సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకున్నప్పటికీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆయనతో పోల్చుకుంటే కొంతవరకు వెనుకబడి పోయాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో ఎట్టకేలకు భారీ సక్సెస్ అయితే అందుకుంటానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఈ సినిమాతో అయిన సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…