సమస్యలు, ఆపదలు ఎప్పుడు ఏ విధంగా వస్తాయో ఎవరూ ఊహించలేరు. అయితే ఆపదలు, సమస్యలు వచ్చిన సమయంలో ఎవరో వచ్చి తమకు సహాయం చేస్తారని ఆలోచిస్తూ ఉండటం వల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆలోచనలను పదును పెడితే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవడం సాధ్యమే. సమస్యలు ఎదురైన సమయంలో చురుకుగా ఆలోచిస్తే సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.
Also Read: షాకింగ్: గుండె జబ్బులున్న వారి ప్రాణాలు తీస్తోన్న కరోనా!
ఈ ఘటనలో ఫ్రెంచ్‌కు చెందిన ఎమిలీ లెరే వ్యక్తి ఎడారిలో ఒంటరిగా చిక్కుకున్నాడు. ఉదయం సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో భరించలేని చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కారులో ఎడారికి షికారుకు వెళ్లిన ఆ వ్యక్తి తన స్నేహితులు మొదట చెప్పిన రూట్ లో కాకుండా మరో మార్గంలో వెళ్లాడు. ఆ మార్గం రాళ్ల మార్గం కావడంతో కారు ఆ మార్గంలోని ఒక రాయిని బలంగా ఢీ కొట్టింది.
దీంతో కారు ఎక్సెల్ దెబ్బ తింది. ఎడారిలో నడుచుకుంటూ వెళ్లడం అసాధ్యం అని ఎమిలీకి అర్థమైంది. వెంటనే ఎమిలీ తన బుర్రకు పదును పెట్టాడు. ఎలక్ట్రీషియన్ గా పని చేసే ఎమిలీకి కారు మెకానిజం గురించి అవగాహన ఉంది. వెంటనే కారును బైక్ లా తయారు చేయాలని భావించాడు. చాలా కష్టమైన పని అయినా వేరే అవకాశం లేకపోవడంతో కారు భాగాలను తీయడం ప్రారంభించాడు.
Also Read: చెట్టును నరకడం ఇష్టం లేకా ఆ వ్యక్తి ఏం చేశాడంటే?
తెచ్చుకున్న ఆహారం కొద్దిగా తింటూ నాలుగు రోజులు శ్రమించి కారు భాగాలను ఊడ పీకాడు. అనంతరం బైకుకు అనువుగా ఉండే పార్టులను ఎంపిక చేసుకుని వెల్డింగ్ చేసే సదుపాయం లేకపోవడంతో వైర్లను చుట్టి బైక్ లా తయారు చేశాడు. స్టీరింగ్ రాడ్డును హ్యాండిల్‌గా మలుచుకుని ఇంజిన్ కు ఇంధనం అందేలా చేసి 12 రోజులు శ్రమించి బైక్ ద్వారా ఇంటికి చేరుకున్నాడు.