‘స్వర్ణా’ వ్యవహారంలో రామ్ కు చిక్కులు తప్పవా?

రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ప్రవేటు కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో సినీ నటుడు రామ్ కు చిక్కులు తప్పవనిపిస్తోంది. స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయం ఫైర్ నుంచి ఫీజుల వరకూ వెళ్లిందని, సిఎం జగన్ ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ట్వీట్ చేయడంతోపాటు, రమేష్ ఆసుప్రతికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్ లు సినీ నటుడు రామ్ ట్విట్టర్ లో ఫోస్టు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. పోలీసులు […]

Written By: Neelambaram, Updated On : August 16, 2020 6:46 pm
Follow us on


రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ప్రవేటు కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో సినీ నటుడు రామ్ కు చిక్కులు తప్పవనిపిస్తోంది. స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయం ఫైర్ నుంచి ఫీజుల వరకూ వెళ్లిందని, సిఎం జగన్ ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ట్వీట్ చేయడంతోపాటు, రమేష్ ఆసుప్రతికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్ లు సినీ నటుడు రామ్ ట్విట్టర్ లో ఫోస్టు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. పోలీసులు మాత్రం రామ్ ట్వీట్ లపై సీరియస్ గా ఉన్నారు.

Also Read: స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…!

విచారణకు ఆటంకం కలిగిస్తే సినీనటుడు రామ్ కు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. కేసుకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వచ్చని వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావిస్తూ కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తామన్నారు.

స్వర్ణా ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసే విషయంలో ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి పరిశీలన లేకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ విషయంలో ఆసుపత్రి యాజమాన్యం తప్పిదం పూర్తిగా ఉంది. అంతే కాకుండా కరోనా తీవ్రత లేని వారికి వైద్యం చేసి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్న యాజమాన్యాన్ని సినీ నటుడు రామ్ సమర్ధిస్తూ ట్వీట్ చేయడంపై సోషల్ మీడియాలోను విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Also Read: పబ్లిసిటీకి ఒక ‘లిమిట్’ ఉంటుంది… ఒక మనస్’సాక్షి’ ఉంటుంది…!

రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్, హీరో రామ్ కు బందువు కావడంతోనే ఆసుపత్రి యాజమాన్యాన్ని వెంటేసుకువస్తున్నాడనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయంలో హీరో రామ్ ట్వీట్ అటు సినీ ప్రముఖులను, ఇటు అభిమానులను నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి. ఇప్పడు పోలీసుల వ్యాఖ్యలతో రామ్ కు చిక్కులు తప్పవనే అనిపిస్తోంది.