https://oktelugu.com/

35 ఏళ్ల స్టార్ హీరోయిన్ కి పెళ్లి చూపులు !

ఇన్నేళ్లు పెళ్లి కాకుండా మిగిలిపోయిన సినీ సెలబ్రిటీల అంతా, ప్రస్తుతం ఈ కరోనా కాలంలో పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఇప్పుడు వీరి లిస్ట్ లో ఓ స్టార్ హీరోయిన్ కూడా చేరేలా కనిపిస్తోంది. కాకపోతే అమ్మడుకు పెళ్లి ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రెజెంట్ చూపులు దాకే వచ్చిందట. ఆ చూపులకి వచ్చిన కుర్రాడు.. సారీ అంకుల్ నచ్చితేనే.. ఈ 35 ఏళ్ల స్టార్ హీరోయిన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరి ఈమెకు నచ్చాలి అంటే.. ఆ వచ్చే […]

Written By:
  • admin
  • , Updated On : August 16, 2020 / 05:42 PM IST
    Follow us on


    ఇన్నేళ్లు పెళ్లి కాకుండా మిగిలిపోయిన సినీ సెలబ్రిటీల అంతా, ప్రస్తుతం ఈ కరోనా కాలంలో పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఇప్పుడు వీరి లిస్ట్ లో ఓ స్టార్ హీరోయిన్ కూడా చేరేలా కనిపిస్తోంది. కాకపోతే అమ్మడుకు పెళ్లి ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రెజెంట్ చూపులు దాకే వచ్చిందట. ఆ చూపులకి వచ్చిన కుర్రాడు.. సారీ అంకుల్ నచ్చితేనే.. ఈ 35 ఏళ్ల స్టార్ హీరోయిన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరి ఈమెకు నచ్చాలి అంటే.. ఆ వచ్చే అంకుల్ బాగా సౌండ్ అన్న అయి ఉండాలి, లేదా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా అయి ఉండాలి. లేకపోతే ఈ స్టార్ హీరోయిన్ కి అతను ఎక్కడు.

    Also Read: తమన్నా షోకి సర్వం సిద్ధం !

    మరి ఎంతైనా చూడ చ‌క్క‌టి సౌంద‌ర్యం ఈ స్టార్ హీరోయిన్ సొంతం కదా.. ఈమె చందమామ లాంటి క‌లువ క‌ళ్ల అంద‌గ‌త్తె కాజ‌ల్ అగర్వాల్. నిజానికి కాజల్ త్వ‌ర‌లో ఏడ‌డుగులు న‌డ‌వ‌నుంద‌నే వార్తలు గత నాలుగేళ్ళ నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఎంతైనా స్టార్ హీరోయిన్ వ్య‌క్తిగ‌త జీవితం అంటే.. పైగా కాజల్ లాంటి హీరోయిన్ పెళ్లి మ్యాటర్ అంటే.. అభిమానులకు కాస్త ఎక్కువ ఆసక్తి ఉంటుందాయే. అందుకే హీరోయిన్ల ప్రేమ‌, స‌హ‌జీవ‌నం, పెళ్లి, విడాకులు లాంటి యవ్వారాలు ఎంత దాచాలనుకున్నా దాగవు.

    Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్

    ఇంతకీ ఈ 35 ఏళ్ల ముద్దుగుమ్మకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. త్వరలో పెళ్లి చూపుల తంతు కూడా జరగబోతుందని తెలుస్తోంది. మరి ఆ తంతు విజయవంతం అయితే.. ఏకంగా పెళ్లి కూడా లాగించేస్తారట. ఇప్పటికే కాజ‌ల్‌ చెల్లెలైన‌ నిషా అగర్వాల్ కి కూడా పెళ్లి అయిపోయి.. ఎప్పుడో పిల్లాడు కూడా పుట్టాడు. అయినా, కాజల్ మాత్రం సినిమా అవకాశాలు వస్తున్నాయని పెళ్లి కూడా చేసుకోకుండా, డబ్బులు సంపాదించడానికి.. 35 ఏళ్ళు వచ్చాక కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఒకవేళ ఇప్పుడు పెళ్లి అయిపోయినా… సినిమాలను మాత్రం మానదట. కాజలా మజాకా !