Janasena Meeting : జనసైనికులు, వీరమహిళలతో కర్నూలులో నాగబాబు సమావేశమయ్యారు. వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అవుతుందని విమర్శించారు. వైసీపీ ఒక పార్టీయేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో వీర మహిళలు, జన సైనికులతో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు సమావేశమయ్యారు.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లాలో ప్రవేశించిన శ్రీ నాగబాబు గారికి జిల్లా సరిహద్దు నుంచే జనసైనికులు ఘన స్వాగతం పలికారు. కర్నూలు జిల్లాలో జనసేన బలంగా ఉందని, గ్రామస్థాయి నుంచి కేడర్ ను పటిష్ఠం చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు. పొత్తుల పై త్వరలో ప్రకటన చేయనున్నట్టు నాగబాబు తెలిపారు.
అంతకుముందు కర్నూలులో నాగబాబు గారికి ఘన స్వాగతం లభించింది. నేరుగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులను కలిశారు నాగబాబు. సుదీర్ఘంగా వారితో మాట్లాడిన నాగబాబు జనసేన అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసుపై దృష్టి పెడతారని న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.