దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మనిషి జీవితంలో ఇంటర్నెట్ కు ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. విద్యార్థులు, యువత ప్రస్తుతం మొబైల్ ఫోన్లే లోకంగా గడుపుతున్నారు. మొబైల్ ఫోన్లలో ఎక్కువ జీబీ ఉండే టారిఫ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకుంటున్నారు. తాజాగా మొబైల్ డేటా ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మొబైల్ డేటాను పూర్తిగా వాడేశాడనే కారణంతో ఒక వ్యక్తి సొంత తమ్ముడిని చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే జోధ్ పూర్ కు చెందిన రాయ్, రామన్ సొంత అన్నాదమ్ములు. రాయ్ అన్న రామన్ మొబైల్ డేటాను పూర్తిగా వినియోగించాడు. ఈ విషయం తెలిసిన రామన్ కోపంతో ఊగిపోయాడు. రాయ్ ను కత్తి తీసుకుని బలంగా పొడిచి చంపేశాడు.
ఆ తరువాత రాయ్ శరీరం నుంచి రక్తం కారడంతో రామన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. రక్తపుమడుగులో పడి ఉన్న రాయ్ ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రామన్ అప్పుడప్పుడూ పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడని అతనికి మతిస్థిమితం లేదని తేలింది. పోలీసులు రామన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండగా మొబైల్ డేటా కోసం రామన్ రాయ్ ను చంపాడని తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. మొబైల్ డేటా కోసం చం[పడం ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.